యాప్నగరం

బస్సులో ప్రయాణికుడి మృతి.. డెడ్ బాడీని నడిరోడ్డుపై వదిలి వెళ్లిన డ్రైవర్

కరోనా మహమ్మారి దెబ్బకు మనుషుల్లో మానవత్వం అడుగంటుతోంది. ఓ ప్రయాణికుడు బస్సులో అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడంతో.. డ్రైవర్, కండక్టర్.. డెడ్ బాడీని నడిరోడ్డుపై దింపేసి వెళ్లిపోయారు.

Samayam Telugu 13 Jul 2020, 4:10 pm
కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రం అవుతున్న వేళ.. మనుషుల్లో మానవత్వం లేకుండా పోతోంది. కోవిడ్ భయంతో అమానవీయంగా వ్యవహరిస్తూ.. సాటి మనిషి అనే భావన లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఆంధ్రాలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తెలియడంతో దార్లోనే బస్సు ఆపేసి.. అతణ్ని, అతడి భార్యను దింపి వెళ్లిన ఘటన మరువక ముందే.. తెలంగాణలో మరో ఘటన చోటు చేసుకుంది.
Samayam Telugu నమూనా చిత్రం


తాండూర్ నుండి వికారాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తోన్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయాడు. అతడితోపాటు ఎవరూ రాకపోవడంతో.. డ్రైవర్, కండక్టర్ అమానవీయంగా వ్యవహరించారు. కేరెల్లి గ్రామంలో బస్సును ఆపి మృతదేహాన్ని నడిరోడ్డుపై పడుకోబెట్టి వెళ్లిపోయారు.

అతడు కోవిడ్ వల్ల మరణించాడా? లేదా మరేదైనా కారణం ఉందా అనే విషయాన్ని కూడా తెలుసుకోకుండా.. డెడ్ బాడీని దింపేసి వెళ్లడం గమనార్హం. ఒకవేళ అతడు కరోనాతో మరణించి ఉంటే.. డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులు వచ్చే దాకైనా ఆగి ఉంటే బాగుండేది. ఆ బస్సులో ఎవరెవరు ప్రయాణించారనే విషయం పూర్తి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు అందిస్తే.. వారందర్నీ క్వాంరటైన్లోకి పంపడానికి వీలుండేది. కానీ చనిపోయింది సాటి మనిషి అనే విషయాన్ని పట్టించుకోకుండా డెడ్ బాడీని దింపేసి వెళ్లిపోవడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.