యాప్నగరం

కేసీఆర్‌కు కరోనా రాదు.. ఆయనే అందరికీ కరోనా తెప్పిస్తారు: నారాయణ

Telangana Coronavirus: ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సచివాలయ పాత భవనాలు కూల్చి కొత్తవి కట్టడం చావప్పుడు పెళ్లి చేసుకోవడం తప్ప మరొకటి కాదని సీపీఐ నారాయణ ఎద్దేవా చేశారు.

Samayam Telugu 10 Jul 2020, 8:54 pm
ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొన్ని రోజులుగా కనిపించకుండా ఉన్న వేళ ఆయనకు కొవిడ్ సోకిందని పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పడుకున్నారని, ఆయనకు కోవిడ్ వచ్చిందని ప్రజలందరూ ఆందోళన చెందవద్దని అన్నారు. కేసీఆర్ కొవిడ్ సోకిందని తానేమీ అనుకోనని, ప్రజలందరికీ కరోనా తెప్పిస్తారని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఢిల్లీలో నారాయణ విలేకరులతో మాట్లాడారు.
Samayam Telugu కేసీఆర్ (ఫైల్ ఫోటో)
kcr image.


కరోనా పేషెంట్లకు సచివాలయంలో చికిత్స అందించాల్సిందని నారాయణ అభిప్రాయపడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సచివాలయ పాత భవనాలు కూల్చి కొత్తవి కట్టడం చావప్పుడు పెళ్లి చేసుకోవడం తప్ప మరొకటి కాదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ నగరానికి చరిత్రే లేదన్నట్టు సీఎం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

‘‘నిజాం నవాబులను పొగిడే వాళ్లు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. సీఎం కేసీఆర్‌ కూడా నిజాంను అనేకసార్లు పొగిడారు. నిజాం వారసులు నాకు ఫోన్ చేసి మీరు మా నిజాం ప్రభువును విమర్శిస్తున్నారని, ఇది మంచిది కాదని హెచ్చరించారు. ఇప్పుడు నేను వారికి చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆయన మేనమామ సర్ వికార్ ఉల్ ఉమ్రా ఆలోచన ప్రకారం ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ లండన్‌లోని బకింగ్ హామ్ ప్యాలెస్ నమూనాతో తెలంగాణ సచివాలయంలో ఒక భవనాన్ని నిర్మించారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన భవనాన్ని పురావస్తు శాఖకు అప్పగిస్తే బాగుండేది. పురాతన భవనాలను పడగొడితే హైదరాబాద్ ప్రాముఖ్యం కనిపిస్తుంది.’’

Must Read: undefined

‘‘కేసీఆర్‌ శకం నుంచే హైదరాబాద్‌ నిర్మాణమైనట్టు చూపిస్తున్నారు. గతంలో నిజాం పాలన గాని, 10 మంది ముఖ్యమంత్రులు పాలించినట్లు చెప్పకుండా తానే హైదరాబాద్ నిర్మించినట్లు చూపాలనే ఉద్దేశంతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర సచివాలయానికి అన్ని హంగులతో భవనాన్ని కట్టడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పను. కరోనా కేసులు అధికంగా ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ ఒకటిగా మారింది. కోవిడ్‌ను అరికట్టాల్సింది పోయి సచివాలయం పడగొట్టడం అంటే మానవత్వ వ్యతిరేక చర్యే. దీన్ని ఖండిస్తున్నాం.’’ అని నారాయణ మాట్లాడారు.

Also Read: కరోనా కోసం తెలంగాణలో స్పెషల్ కాల్‌సెంటర్.. ఫోన్ నెంబర్ ఇదే..Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.