యాప్నగరం

లాక్‌డౌన్ ఓ రకంగా మంచి చేసింది: తెలంగాణ పోలీసులు

లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక కార్యకలాపాలన్నీ దాదాపుగా నిలిచిపోయాయి. ఎన్ని ప్రతికూలతలు ఉన్నా లాక్‌డౌన్ ఓ మంచి చేసిందంటున్నారు తెలంగాణ పోలీసులు.

Samayam Telugu 13 Apr 2020, 5:08 pm
కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. కానీ లాక్‌డౌన్ ఓ రకంగా మంచే చేసిందంటున్నారు తెలంగాణ పోలీసులు. లాక్‌డౌన్ సమయంలో క్రైమ్ రేటు గణనీయంగా తగ్గిందని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. జనం రోడ్లు ఎక్కకపోవడంతో.. స్నాచింగ్ (గొలుసు దొంగతనాలు) రేటు సున్నాకు పడిపోయిందని డీజీపీ తెలిపారు.
Samayam Telugu dgp mahendar reddy


మార్చి 1-21 తేదీల మధ్య 10 స్నాచింగ్ కేసులు నమోదు కాగా.. మార్చి 22 నుంచి ఏప్రిల్ 9 వరకు ఒక్క స్నాచింగ్ కేసు కూడా నమోదు కాలేదు. వాహనాల దొంగతనాలు, కిడ్నాప్‌లు, దొంగతనాలు, రేప్‌ కేసులు.. ఇలా పలు నేరాలు గణనీయంగా తగ్గాయి.
తెలంగాణలో మార్చి 1 నుంచి మార్చి 21 వరకు మొత్తం 764 కేసులు కాగా, మార్చి 22 నుంచి ఏప్రిల్ 9 వరకు 162 కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలను తెలంగాణ పోలీస్ శాఖ విడుదల చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.