యాప్నగరం

జంట నగరాల్లో కండోమ్‌లు, గర్భ నిరోధక మాత్రలకు గిరాకీ

Coronavirus Hyderabad: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో ప్రస్తుతం కండోమ్‌లతోపాటు గర్భనిరోధక మాత్రలకు కూడా డిమాండ్ పెరిగిందని ఫార్మా సంస్థలు చెబుతున్నాయి. ఈ లాక్ డౌన్ కాలంలో డిమాండ్ అధికంగా ఉండడంతో సరఫరా కూడా పెంచామని వారు చెబుతున్నారు.

Samayam Telugu 6 May 2020, 5:57 pm
దేశంలో కరోనా నియంత్రణలో భాగంగా విధించిన లాక్ డౌన్ వల్ల జనం ఇళ్లకే పరిమితం అయ్యారు. కుటుంబాలకు దూరంగా ఉండేవారు సైతం ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో తమ వారితో ఆనందంగా గడుపుతున్నారు. ఈ లాక్ డౌన్ ప్రభావంతో జంట నగరాల్లో గర్భనిరోధక మాత్రలు, కండోమ్‌లకు డిమాండ్ పెరగడం విశేషం. ఈ సమయంలో జనం నుంచి వీటికి డిమాండ్ బాగా పెరగడంతో మెడికల్ షాపుల్లోనూ నిల్వలు నిండుకుంటున్నాయి. దీంతో మెడికల్ షాపుల యజమానులు కూడా అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో ప్రస్తుతం కండోమ్‌లతోపాటు గర్భనిరోధక మాత్రలకు కూడా డిమాండ్ పెరిగిందని ఫార్మా సంస్థలు చెబుతున్నాయి. ఈ లాక్ డౌన్ కాలంలో డిమాండ్ అధికంగా ఉండడంతో సరఫరా కూడా పెంచామని వారు చెబుతున్నారు. అయితే మెడికల్ షాపుల్లో గర్భ నిరోధక మాత్రల అమ్మకాలకు సంబంధించి వివరాలు నమోదు చేయడం లేదని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి వాటి అమ్మకాల విషయంలో మందుల షాపుల్లో ఎన్ని అమ్ముడుపోయనే విషయాలను నమోదు చేసుకోవాలి.

Also Read: undefined

అయితే, అందుకు భిన్నంగా మెడికల్ షాపుల యజమానులు ఆ లెక్కలను ఎంట్రీ చేయకుండా దాచిపెడుతున్నారని తెలుస్తోంది. డాక్టర్ల సలహా లేకుండా ఏ గర్భనిరోధక మాత్రలు పడితే అవి సేవిస్తే తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మరీ డోసు ఎక్కువైతే ఒక్కోసారి ప్రాణాలపైకి వచ్చే ప్రమాదం లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గర్భ నిరోధక మాత్రలకు డిమాండ్ రావడానికి కారణం మారిన లాక్ డౌన్‌లో మారిన జీవన విధానమేనని వైద్యులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.