యాప్నగరం

తెగిపడిన బారీకేడ్లు.. హుస్సేన్ సాగర్ జలాల్లో పడ్డ భక్తులు

ట్యాంక్ బండ్‌పై గణనాథుల నిమజ్జనంలో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. నెక్లెస్ రోడ్డులోని ఆరో నంబర్ క్రేన్ వద్ద బారీకేడ్లు తెగిపోవడంతో నలుగురు భక్తులు సాగర్ జలాల్లో పడిపోయారు.

Samayam Telugu 12 Sep 2019, 5:50 pm
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో జరుగుతున్న వినాయక నిమజ్జనంలో స్వల్ప ప్రమాదం జరిగింది. బారికేడ్లు తెగిపోవడంతో భక్తులు హుస్సేన్‌ సాగర్‌ జలాల్లో పడిపోయారు. ఖైరతాబాద్ మహా గణపతిని నిమజ్జనం చేసిన 6వ నంబర్‌ క్రేన్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మహా గణపతి నిమజ్జనాన్ని చూడటానికి భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. దీంతో క్రేన్ వద్ద తోపులాట చోటు చేసుకుంది. బారికేడ్లపై ఒత్తిడి పెరిగి తెగిపడటంతో నలుగురు వ్యక్తులు సాగర్ జలాల్లో పడిపోయారు.
Samayam Telugu Representational Image


అక్కడే ఉన్న గజ ఈతగాళ్లు వెంటనే హుస్సేన్ సాగర్‌లోకి దిగి సాగర్ జలాల్లో పడిన ఆ నలుగురు భక్తులను కాపాడారు. ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన చోట సాగర్ నీటి లోతు ఎక్కువగా ఉండటం గమనార్హం.

Also Read: గంగమ్మ ఒడికి బడా గణేష్.. ప్రత్యేకతలివే

50 టన్నుల బరువున్న ఖైతరాబాద్ బడా గణేష్‌ విగ్రహానికి నెక్లెస్ రోడ్డులోని క్రేన్ నంబర్ 6వద్ద నిమజ్జనం పూర్తి చేశారు. భారీ గణనాథుడు పూర్తిగా నీట మునిగేలా అధికారులు ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లోతు ఎక్కువగా ఉన్న చోట మహా గణపతి విగ్రహాన్ని జలప్రవేశం చేయించారు. గురువారం (సెప్టెంబర్ 12) మధ్యాహ్నం 1.45 గంటలకు ఈ ప్రక్రియ పూర్తైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.