యాప్నగరం

ఇంత కర్కశమా.. దిశ నిందితులు చెప్పింది విని షాకైన పోలీసులు!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితులు విస్మయకర వాస్తవాలను వెల్లడించారు. అత్యాచారం, హత్య చేసిన సమయంలో తాము ఫుల్లుగా మద్యం మత్తులో ఉన్నామని నిందితులు తెలిపారు. ఉదయం నుంచి లారీలో ఖాళీగా కూర్చున్నామని.. యువతి ఒంటరిగా కనిపించడంతో అత్యాచారం చేయాలని అనుకున్నామని నిందితులు చెప్పారు. ప్రస్తుతం వీరంతా చర్లపల్లి జైల్లో రిమాండ్‌పై ఉన్నారు.

Samayam Telugu 2 Dec 2019, 8:01 pm

Samayam Telugu disha rape and murder case accused reveal stunning details to police
ఇంత కర్కశమా.. దిశ నిందితులు చెప్పింది విని షాకైన పోలీసులు!

ఆలస్యంగా రావాలనుకున్నారు..

బాధితురాలు సాయంత్రం స్కూటీ పార్కింగ్ చేసి వెళ్లడాన్ని గమనించిన నిందితులు.. ఆమె ఎంత ఆలస్యంగా వస్తే.. తమ పని అంత ఈజీ అవుతుందని భావించినట్టు తెలిపారు. వారు అనుకున్నట్టుగానే ఆమె రాత్రి 9 గంటల తర్వాత వచ్చింది. దీంతో గబగబా లారీ నుంచి కిందకు దిగారు.

రేప్ చేసి పారిపోదామనుకున్నారు కానీ..

బాధితురాలిని రేప్ చేసిన తర్వాత.. అక్కడి నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్నామని నిందితులు తెలిపారు. అప్పటికీ తాము మద్యం తాగుతూనే ఉన్నామన్నారు. అత్యాచారం చేసిన తర్వాత.. ఆమెను చంపేసి దహనం చేస్తే.. దొరకకుండా తప్పించుకోవచ్చని భావించామని.. అందుకే ఇలా చేశామని నిందితులు చెప్పడంతో పోలీసులు ఖంగుతిన్నారు. ఈ కేసు ఇంత పెద్దది అవుతుందని తాము అనుకోలేదన్నారు.

రెండు రోజుల ముందే దొరికాడు..

దిశ ఘటనకు రెండు రోజుల ముందు.. ఈ కేసులో ప్రధాన నిందితుడైన లారీ డ్రైవర్ మహ్మద్ ఆరీఫ్‌ను ఆర్టీఏ అధికారులు పట్టుకున్నారు. కర్ణాటక నుంచి హైదరాబాద్ వస్తుండగా.. లారీ ఆపిన ఆర్టీఏ అధికారులు.. 2017 తర్వాత అతడి డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యువల్ చేసుకోలేదని తెలిపారు.

మద్యం తాగడం మొదలుపెట్టాక..

నవీన్‌, చెన్నకేశవులతో కలిసి ఇనుప కడ్డీల లోడ్‌తో వచ్చిన ఆరీఫ్.. అన్‌లోడింగ్‌ ఆలస్యం కావడంతో.. కొన్నింటిని విక్రయించాడు. నవంబర్ 27న ఉదయం 9 గంటలకు తొండుపల్లి ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌కు వచ్చారు. సాయంత్రం 5.30 గంటలకు మద్యం తాగాడం మొదలుపెట్టారు. ఆ కాసేపటికే వారి కన్ను బాధితురాలిపై పడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.