యాప్నగరం

సూర్యాపేటలో విషాదం.. నర్సులతో డెలివరీ పసికందు మృతి

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందాడు. కాన్పు సమయంలో శిశువు ప్రమాదవశాత్తు సిబ్బంది చేతిలోనుంచి జారి కింద పడటంతో తలకు గాయమైంది

Samayam Telugu 11 Nov 2020, 11:56 am
సూర్యాపేట జిల్లా జనరల్ ఆసుపత్రిలో వైద్యుల నిర్వాకంతో శిశువు ప్రాణాలు కోల్పోయాడు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఆపరేషన్ వికటించడంతో మగ శిశువు మృత్యువాతపడ్డాడు. డాక్టర్‌కు బదులు నర్సులతో వైద్యం చేయించడంతోనే శిశువు మృతి చెందాడని ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట బంధువులు ధర్నాకు దిగారు. మృత శిశువుకు తలపై గాయం ఉన్నట్లు బంధువులు గుర్తించారు.
Samayam Telugu సూర్యాపేటలో విషాదం
child death in suryapet


ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. జంటనగరాల్లో కూడా వైద్యుల నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన శిశువులు మృతి చెందారు. హైదరాబాద్ వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన బాబు వైద్యం వికటించి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతి జరిగింది. కాన్పు సమయంలో శిశువు ప్రమాదవశాత్తు సిబ్బంది చేతిలోనుంచి జారి కింద పడటంతో తలకు గాయమైంది. వెంటనే శిశువును చికిిత్స నిమిత్తం నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు శిశువు అప్పటికే మృతి చెందిందని తెలిపారు.

Read More: టీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేక ఆ పార్టీ నేత మృతి

సీకింద్రబాబ్ బీసెంట్ ఆస్పత్రిలో కూడా ఇలాగే జరిగింది. డెలివరీ సమయంలో బాబు చనిపోయాడంటూ తల్లిదండ్రులకు మృతదేహాన్ని అప్పగించారు. అయితే దహనసంస్కరాలు చేస్తుండగా పసికందు తలపై ఆపరేషన్ కత్తి గాయాలు గుర్తించారు. దీంతో శిశువు తండ్రి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.