యాప్నగరం

మేడ్చల్‌లో కుక్క మిస్సింగ్.. కేసు పెట్టిన ఓనర్, పోలీసుల గాలింపు.. వీడియో

Medchel: శునకం యజమాని ఆనంద్ తన పెంపుడు కుక్కకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సైతం పోలీసులకు అందజేశాడు. ఆ కుక్కంటే తమకు ఎంతో ఇష్టమని దయచేసి వెతికి పెట్టాలని పోలీసులను కోరాడు.

Samayam Telugu 21 Oct 2020, 4:35 pm
మేడ్చల్ జిల్లా రాచకొండ పోలీసు కమిషనరేట్ కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో తన పెంపుడు కుక్క కనిపించడం లేదని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాని పేరు సీజర్ అని ఎలాగైనా వెతికిపెట్టాలని ఆ వ్యక్తి పోలీసులను వేడుకున్నాడు. కుషాయిగూడలోని టీఎస్ఐఐసీ పంచవటి కాలనీలో ఈ ఘటన జరిగింది. ఈనెల 13వ తేదీ రాత్రి నుండి తన పెంపుడు కుక్క సీజర్ కనిపించడం లేదని యజమాని ఆనంద్ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని కుక్క కోసం గాలిస్తున్నారు.
Samayam Telugu తప్పిపోయిన కుక్క సీజర్
dog missing in kushaiguda


శునకం యజమాని ఆనంద్ తన పెంపుడు కుక్కకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సైతం పోలీసులకు అందజేశాడు. ఆ కుక్కంటే తమకు ఎంతో ఇష్టమని దయచేసి వెతికి పెట్టాలని పోలీసులను కోరాడు. అయితే, తన పెంపుడు కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లిన సమయంలో దానితో చెరువులో ఈత కొట్టించడం వంటి వీడియోలు యజమాని షేర్ చేశాడు. కుక్కకు వారు దుస్తులు కూడా తొడిగేవారని ఫోటోలను చూస్తే అర్థమవుతోంది. దీన్ని బట్టి ఆ పెంపుడు శునకాన్ని అతను ఎంతో ప్రేమతో పెంచుకున్నాడో తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.