యాప్నగరం

టైర్ మారుస్తున్న డ్రైవర్‌ను చిదిమేసి.. తప్పించుకునే క్రమంలో మరో లారీ కింద పడి..

చిట్యాల సమీపంలో ఓ లారీ డ్రైవర్ టైరు మారుస్తుండగా.. వేగంగా వచ్చిన మరో లారీ అతడిపై నుంచి దూసుకెళ్లింది. దీంతో అతడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మరో లారీ కింద పడి చనిపోయాడు.

Samayam Telugu 13 Jun 2020, 11:56 am
విధిరాతను మార్చడం ఎవరి తరం కాదు, చేసిన తప్పుకి శిక్ష అనువించక తప్పదు అని పెద్దలు తరచుగా అంటుంటారు. ఈ రెండు మాటలూ అక్షర సత్యాలని నిరూపించే ఘటన నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... లారీ వెనుక టైర్ అరిగిపోయిందని గ్రహించిన డ్రైవర్ చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి వద్ద వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపాడు.
Samayam Telugu నమూనా చిత్రం
trcuk tyre


శనివారం ఉదయం చిట్యాల సమీపంలోని గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై వెళ్తుండగా ఓ లారీ డ్రైవర్ వెనుక టైర్ పూర్తిగా అరిగిపోయిందని గుర్తించాడు. వాహనాన్ని రోడ్డు పక్కకు తీసి టైర్ మారుస్తుండగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ అతడి మీది నుంచి వెళ్లిపోయింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

దీంతో ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ కంగారుపడ్డాడు. అక్కడి నుంచి పారిపోయే క్రమంలో మరో లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఒకే చోట ఇద్దరు లారీ డ్రైవర్లు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడం అక్కడున్న వారిని కలచి వేసింది. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.