యాప్నగరం

కేసీఆర్‌కు ఈసీ బిగ్‌ షాక్.. ‘దళితబంధు’ నిలిపివేయాలంటూ ఆదేశాలు

ఉపఎన్నికలు జరుగుతున్నందున హుజురాబాద్‌లో దళిత బంధు పథకాన్ని వెంటనే నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం సంచలన ఆదేశాలిచ్చింది.

Samayam Telugu 18 Oct 2021, 8:57 pm
హుజురాబాద్ ఉపఎన్నికల వేళ తెలంగాణ సీఎం కేసీఆర్‌కి కేంద్ర ఎన్నికల సంఘం గట్టి షాకిచ్చింది. హుజురాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ‘దళిత బంధు’ను వెంటనే నిలిపివేయాలంటూ సోమవారం సంచలన ఆదేశాలు జారీచేసింది. ఉపఎన్నిక తర్వాత దళితబంధును యథావిథిగా కొనసాగించుకోవచ్చునని స్పష్టం చేసింది.
Samayam Telugu kcr


హుజురాబాద్‌లో ఉపఎన్నికలు ఉన్నందున దళితబంధుతో ఓటర్లు ప్రలోభాలకు గురయ్యే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఈ పథకాన్ని తిరిగి అమలు చేసుకోవచ్చని తెలిపింది. సీఎం కేసీఆర్ దళితబంధును ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద అర్హులైన దళితులకు రూ.10 లక్షలు అందిస్తున్నారు. ఇప్పటికే హుజూరాబాద్, వాసాలమర్రిలో అర్హులైన దళిత కుటుంబాలకు ‘దళితబంధు’ నిధులను విడుదల చేశారు. మూడు విడతల్లో ఈ డబ్బులను వారి ఖాతాల్లోకి జమ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.