యాప్నగరం

కరోనాపై తీరు మారకపోతే చర్యలు తప్పవు, ఇప్పటికే ఆస్పత్రిపై వేటు: ఈటల

Coronavirus Telangana: కరోనా వైరస్ చికిత్స విషయంలో ప్రైవేటు ఆస్పత్రుల తీరుపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుసార్లు నిబంధనలు ఉల్లంఘించిన సోమాజీగూడలో ఓ కార్పొరేటు ఆస్పత్రికి కరోనా చికిత్స అనుమతులు రద్దు చేసినట్లు గుర్తు చేశారు.

Samayam Telugu 4 Aug 2020, 7:12 pm
కరోనా సోకిన రోగులకు అవసరమైన ఆక్సీజన్ నిరంతరం సరఫరా చేస్తున్నామని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. రాష్ట్రంలో 10 వేల పడకలకు మెరుగైన విధంగా ప్రాణవాయువు సరఫరా జరుగుతోందని వెల్లడించారు. ఇటీవల కొన్ని ఆస్పత్రుల్లో ఆక్సీజన్ అందక కరోనా రోగులు చనిపోయారనే వార్తలు సరికాదని అన్నారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న రోగులకు కొన్ని సందర్భాల్లో పెద్ద మొత్తంలో ఆక్సీజన్ అందించినా ప్రయోజనం ఉండబోదని అన్నారు. ఆక్సీజన్ అందించినా వారి ఊపిరితిత్తులు దాన్ని పీల్చుకొనే స్థితిలో ఉండడం లేదని వివరించారు. హైదరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu ఈటల రాజేందర్
etela rajender


కరోనా వైరస్ చికిత్స విషయంలో ప్రైవేటు ఆస్పత్రుల తీరుపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుసార్లు నిబంధనలు ఉల్లంఘించిన హైదరాబాద్ సోమాజీగూడలో ఓ కార్పరేటు ఆస్పత్రికి కరోనా చికిత్స అనుమతులు రద్దు చేసినట్లు గుర్తు చేశారు. కరోనా రోగుల పట్ల అన్యాయంగా ప్రైవేటు ఆస్పత్రులు వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. చిన్న వైద్యానికి రూ.లక్షల బిల్లు వేయడం హేయమైన చర్య అని, ప్రైవేటు ఆస్పత్రుల తీరు మానవత్వానికే కళంకం అని అన్నారు. ఇంత చెప్పినా మారకపోతే ప్రైవేటు ఆస్పత్రులకు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తామని తీవ్ర హెచ్చరిక చేశారు.

అప్పటిదాకా ఆగకండి..
జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దని ఈటల రాజేందర్ తెలిపారు. వారంతా వెంటనే సమీపంలోని పీహెచ్‌సీలను సంప్రదించాలని సూచించారు. కరోనా వస్తే భయపడాల్సిన అవసరం లేదని, పీహెచ్‌సీలో టెస్టు తరువాత కరోనా అని నిర్ధారణ అయితే ఏ రకమైన ట్రీట్’మెంట్ ఇవ్వాలనే అంశాన్ని నిర్ణయిస్తారని తెలిపారు. చాలామంది ఊపిరి సమస్యలు తలెత్తేవరకు ఆగుతున్నారని.. ఇది చాలా ప్రమాదమని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.