యాప్నగరం

Etela Rajender: పండగకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉంది: ఈటల

Etela Rajender: గులాబీ దళపతి కేసీఆర్‌పై బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి ఫైర్ అయ్యారు. పండగకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉందని విమర్శించారు. మేడ్చల్‌లో పర్యటించిన ఆయన.. టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఎప్పుడో దూరమైందని వ్యాఖ్యానించారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 25 Sep 2022, 2:11 pm

ప్రధానాంశాలు:

  • కేసీఆర్ ప్రభుత్వంపై ఈటల రాజేందర్ విమర్శలు
  • పండగకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని ఆరోపణ
  • టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు దూరమైందని వ్యాఖ్య
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Etela Rajender
సభలో మాట్లాడుతున్న ఈటల రాజేందర్
Etela Rajender: తెలంగాణలో దసరా పండగకు జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని.. ఏ పూటకు ఆ పూట కలెక్షన్ చేసి ఇచ్చినా కూడా జీతాలు ఇవ్వలేరని.. బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. తెలంగాణ వచ్చినప్పుడు 74 వేల కోట్ల అప్పు ఉంటే.. అది ఇప్పుడు 5 లక్షల కోట్లకు చేరిందని వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని.. కేసీఆర్ (CM KCR) రాజ్యంలో పుట్టబోయే బిడ్డలమీదా లక్షా 25 వేల అప్పు ఉందని ఆరోపించారు. మేడ్చల్‌లో పర్యటించిన ఈటల.. కేసీఆర్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ తెరమరుగు కాబోతోందని.. ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. గులాబీ పార్టీ బలంగా ఉన్నట్టు బయటికి కనిపిస్తుందని.. కానీ అది ప్రజలను విడిచిపెట్టిన పార్టీ అని వ్యాఖ్యానించారు. అధికారం ఇచ్చిన ప్రజల మీద దౌర్జన్యాలు చేస్తున్న టీఆర్ఎస్ (TRS Party) తెరమరుగు కాక తప్పదని స్పష్టం చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత.. కేసీఆర్ అసలు స్వరూపం బయటపడిందని ఈటల వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇనుప కంచెలు, బూటు చప్పుళ్ల మధ్య ఉంటారు కానీ.. ప్రజల గోడు వినిపించుకోరని ఆరోపించారు.

దళిత బంధు పథకాన్నే సరిగా అమలు చేయని కేసీఆర్.. గిరిజన బంధు ఇస్తాడటా అని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. మునుగోడులో 30 గ్రామాల్లో గిరిజనులు ఉంటారని.. అందుకే గిరిజన బంధును తెరపైకి తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. దళితబంధు అందరికీ ఇవ్వాలంటే 2 లక్షల కోట్లు కావాలని.. దాన్ని అమలు చేయడానికి 20 ఏళ్లు పడుతుందని వివరించారు. వచ్చే ఏడాదిదాకానే కేసీఆర్‌కు అధికారం ఉంది.. మరి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రైతుబంధు, పింఛన్, కళ్యాణలక్ష్మీ పేరుమీద కేసీఆర్ ఇచ్చేది 26 వేల కోట్లు అయితే.. తాగుడు ద్వారా గుంజుకునేది 42 వేల కోట్లు అని వివరించారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.