యాప్నగరం

Huzurabad: కేసీఆర్, హరీశ్‌పై ఈటల ఫైర్.. అంత మాట అనేశారే.!

హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్‌కి ముహూర్తం ఖరారైంది. రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. వచ్చే నెల 30 వ తేదీ ఎన్నిక జరగనుండడంతో నేతలు దూకుడు పెంచారు.

Samayam Telugu 28 Sep 2021, 4:22 pm
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ రానుండడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. కొద్దిరోజులుగా స్తబ్దుగా ఉన్న నేతలు మళ్లీ స్వరం పెంచారు. ప్రజాక్షేత్రంలో దూసుకుపోయేందుకు పావులు కదుపుతున్నారు. ప్రత్యర్థులపై మాటల తూటాలతో విరుచుకుపడుతున్నారు. టీఆర్‌ఎస్‌కి రాజీనామా చేసి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పీడు పెంచారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్, మంత్రులను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
eatala


ఉప ఎన్నిక కోసం నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ ఈటల ధ్వజమెత్తారు. ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో ప్రలోభాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. నీచులు.. పరమ నీచులు నీచ రాజకీయం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎలాంటి ప్రలోభాలకు గురిచేసినా హుజూరాబాద్ ప్రజలు ఈటలను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని.. మహిళలు, యువకులు, పెద్దలు అందరూ తన వెంటే ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇది కేసీఆర్ అహంకారానికి.. హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్న పోటీ అని ఆయన అభివర్ణించారు.

మాజీ సహచరుడు, మంత్రి హరీష్ రావుపై మరోమారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసులతో బీజేపీ నేతలను భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని.. నీచ రాజకీయం చేస్తున్నారని ఈటల అన్నారు. టీఆర్‌ఎస్ నీచపు పార్టీ అని.. ఆ పార్టీ నేతలు నీచపు మనుషులని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం దొంగ ఓట్లు చేర్చుతున్నారని ఆయన ఆరోపించారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.