యాప్నగరం

మాజీ మంత్రి జూపల్లికి టీఆర్ఎస్ ఝలక్!

Kollapur Municipality: మున్సిపల్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావహులకు జూపల్లి కృష్ణారావు మద్దతు పలికారు. వీరంతా జూపల్లి వర్గీయులే కావడం గమనార్హం. తన వర్గీయులను ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున పోటీ చేయించి, జూపల్లి వారికి మద్దతు పలికారు.

Samayam Telugu 26 Jan 2020, 4:12 pm
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకి టీఆర్ఎస్ అధిష్ఠానం ఊహించని ఝలక్ ఇచ్చింది. తాజా మున్సిపల్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీలో గెలుపొందిన రెబెల్‌ అభ్యర్థులు టీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తారని జూపల్లి చెప్పినా అధిష్ఠానం అందుకు ఒప్పుకోలేదు. కొల్లాపూర్‌లో జూపల్లి వర్గీయులు టీఆర్ఎస్‌లో చేరేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది. కొల్లాపూర్‌లో 20 వార్డులకు గాను టీఆర్ఎస్ తొమ్మిది చోట్ల గెలిచిన సంగతి తెలిసిందే. రెబెల్‌గా మారిన జూపల్లి వర్గీయులు 11 మంది గెలిచారు. అయితే, మున్సిపల్ ఛైర్ పర్సన్ కుర్చీ పొందేందుకు 12 స్థానాలు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎక్స్ అఫీషియో ఓట్లతో టీఆర్ఎస్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోనుంది. ఇప్పటికే గెలిచిన 9 మంది అభ్యర్థులను స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలు క్యాంపులకు తరలించారు.
Samayam Telugu Jupalli Krishnarao in kollapur


Must Read: భూకంపం మళ్లీ వస్తుంది. అదే కారణం.. శాస్త్రవేత్త కీలక విశ్లేషణ

Also Read:
కేసీఆర్‌ దమ్ముంటే ఆ పని ఆపాలి. అప్పుడు ఏ గతి పడుతుందంటే.. ఎంపీ అర్వింద్
మున్సిపల్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావహులకు జూపల్లి కృష్ణారావు మద్దతు పలికారు. వీరంతా జూపల్లి వర్గీయులే కావడం గమనార్హం. తన వర్గీయులను ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున పోటీ చేయించి, జూపల్లి వారికి మద్దతు పలికారు. టీఆర్ఎస్‌లో ఉండి బహిరంగంగా ప్రచారం చేసిపెట్టారు. ఈ పరిణామంతో టీఆర్ఎస్ అధిష్ఠానానికి ఆగ్రహం తెప్పించింది!

Also Read: నిజామాబాద్ మేయర్ పీఠంపై మరింత ఉత్కంఠ.. వ్యూహకర్త అతనేనా..

మరోవైపు, అక్కడి ఎమ్మెల్య హర్షవర్ధన్‌కు మాజీ మంత్రి జూపల్లికి విభేదాలు బాగా వేడెక్కాయి. మున్సిపల్ ఎన్నికలకు ముందు వారం రోజులపాటు నువ్వా.. నేనా అన్నట్లుగా ఎమ్మెల్యే వర్గం, మాజీ మంత్రి అనుచరులు జోరుగా ప్రచారం చేశారు. ఎన్నికలు ముగిశాక కూడా కొల్లాపూర్‌లో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ప్రతిపక్ష పార్టీల నాయకులు, అభ్యర్థులు బ్యాలెట్ పెట్టెలు భద్రపరచిన స్ట్రాంగ్ రూం వద్దకు తరలివచ్చారు. కావాలనే విద్యుత్తు నిలిపివేసి బ్యాలెట్ బాక్స్‌లను తారుమారు చేస్తున్నారంటూ వారు ఆందోళనకు దిగారు. ఇరువర్గాల మధ్యన నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కొల్లాపూర్ ఉద్రిక్తంగా మారింది. పట్టణంలో 144 సెక్షన్ విధించారు.

Also Read:‘మనమంతా ఇక్కడే పుట్టాం.. ఇక్కడే ఛస్తాం’
Must Read: కళ్లు మిరుమిట్లు గొలిపేలా రిపబ్లిక్ డే, నాంపల్లిలో గవర్నర్ జెండావందనం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.