యాప్నగరం

ఉద్యోగం కోసం ఉత్తుత్తి పెళ్లి.. ఒకే ఇంట్లో ఉంటున్నామని సర్టిఫికెట్ కూడా

సినిమాల్లో చూపించేలా ఓ జంట ఉద్యోగం కోసం ఉత్తుత్తి పెళ్లి చేసుకుంది. అధికారులు సంతకాలు కూడా తీసుకున్నారు. అయితే గ్రామస్థులు చెప్పడంతో అసలు విషయం బయటపడింది.

Samayam Telugu 4 Nov 2020, 8:08 am
ఉద్యోగం కోసం తమకు పెళ్లి అయిన కాలేదని... లేదంటే జాబ్ కోసం తమకు పెళ్లి అయిపోయిందని ఇలా అనేక రకాల అబద్ధాలు.. వేషాలు వేయడం.. మనం సాధారణంగా సినిమాల్లోనే చూస్తుంటాం. నరేష్ నటించిన ఒకప్పటి చిత్రం భళారే విచత్రం సినిమాలో... ఎక్కడ తన బాస్ తనకు ఆయన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసేస్తాడోనన్న భయానికి తనకు పెళ్లి అయిపోయిందని ఓ చిన్న అబద్ధం ఆడి హీరో అనేక కష్టాలు పడుతుంటాడు. ఇక భార్య బిడ్డలు సినిమాలో కూడా అలనాటి అందాల హీరో అక్కినేని నాగేశ్వర్రావు సైతం పెద్ద కుటుంబాన్ని పోషించేదుకు ఉద్యోగం కోసం తనకు పెళ్లి కాలేదని చెప్తాడు.
Samayam Telugu ఉద్యోగం కోసం ఉత్తుత్తి పెళ్లి
fake marriage job


అయితే అలాంటి ఓ ఘటన ఇక్కడ జరిగింది. అయితే ఇక్కడ ఉద్యోగం కోసం ఓ జంట తమకు పెళ్లి అయిందని అబద్ధం ఆడింది. అంతేకాదు... తమకు మ్యారేజ్ అయినట్లు సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చింది. వాటిని అధికారులు కూడా పరిశీలించి ఓకే చేసేశారు. ఉద్యోగం కూడా వచ్చేసింది. అయితే ఇదంతా అబద్ధమని స్థానికులు ఫిర్యాాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలోని లాల్ సింగ్ తండాలో అంగన్ వాడి పోస్ట్ కోసం అదే తండాకు చెందిన నరేష్ (17) సంవత్సరాలు మరో తండాకు చెందిన కవిత అనే అమ్మాయితో వివాహం అయినట్టు ఫేక్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చారు.

Read More: తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం... ఆ విద్యార్థులంతా పాస్

అన్ని చూసి పరిశీలించాల్సిన అధికారులు... గుడ్డిగా సంతకాలు చేశారు. ఇది సాక్షాత్తు ఓ మండల తహిసీల్దార్ చేసిన నిర్వాహకం. ఫరూక్ నగర్ మండల తహసిల్దార్ పాండు తేదీ 16 /9/2020నాడు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నాట్టు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. దీంతో గ్రామస్థులు తేదీ 30/9/2020 నాడు వాలిద్దరికి వివాహం కాలేదని షాద్ నగర్ ఆర్డీఓకు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేసారు. దీంతో తేదీ 1/10/2020/ నాడు తహసిల్దార్ మళ్ళీ దాన్ని క్యాన్సలేషన్ చేసి ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.