యాప్నగరం

కేబుల్ బ్రిడ్జిపై ఈ ఫ్యామిలీ ‘నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్’.. పరుగో పరుగు.. వీడియో

Durgam Cheruvu: ఈ కుటుంబానికి సంబంధించిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విడుదల చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో దాన్ని ఉంచి, ఇలాంటి ఫ్యామిలీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

Samayam Telugu 22 Oct 2020, 7:49 am
సైబరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై రకరకాల విన్యాసాలు కనిపిస్తున్నాయి. పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్న రోడ్లపై బండి ఆపి ఫోటోలు దిగుతూనే ఉన్నారు. తాజాగా ఓ కుటుంబం కేబుల్ బ్రిడ్జి మీద ఫోటోలు దిగడానికి బండి ఆపింది. ఆ తర్వాత బండి నంబర్‌కు చలాన్ పడకూడదని అక్కడికి వచ్చిన వ్యక్తి అతి తెలివి ప్రదర్శించి తన భార్య చున్నీతో నెంబర్ ప్లేట్‌ను కప్పేశాడు. భార్యా పిల్లలతో ఫోటో దిగే ప్రయత్నం చేశాడు.
Samayam Telugu కేబుల్ బ్రిడ్జిపై బండి ఆపిన ఫ్యామిలీ
cable bridge


ఇంతలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మైక్‌లో అనౌన్స్‌మెంట్ చేశారు. ఆ మైక్ వారిని పరిశీలిస్తున్న కెమెరా దగ్గరే ఉంది. ఈ విషయం గమనించిన వారు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. చిన్న పిల్లలతో సహా కేబుల్ బ్రిడ్జి మధ్యలో ఆగి ఫోటోలు దిగడం ప్రమాదకరం అని తెలిసిన చాలా మంది కుటుంబాలు ఈ విధంగానే చేస్తున్నాయి. కేబుల్ బ్రిడ్జి మీద ఆగడం ట్రాఫిక్ రూల్స్ కి విరుద్ధం అయినప్పటికీ అక్కడ ఆగి చాలా మంచి ఫోటోలు దిగుతున్నారు.

తాజాగా ఈ కుటుంబానికి సంబంధించిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విడుదల చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో దాన్ని ఉంచి, ఇలాంటి ఫ్యామిలీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ట్రాఫిక్ రూల్స్ ఎల్లప్పుడూ పాటించాలని ప్రజలకు సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.