యాప్నగరం

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

మంటలు పెద్దఎత్తున ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయపడుతున్నారు. మూడు ఫైరింజన్లతో మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Samayam Telugu 11 Nov 2020, 6:48 am
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని పాతబస్తీలో బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని నబీకరీం ప్రాంతంలో కట్టెల కార్ఖానాతో పాటు పక్కనే ఉన్న కార్ మెకానిక్ షెడ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని కీలలు భారీగా ఎగిసి పడ్డాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Samayam Telugu అగ్నిప్రమాదం (ఫైల్ ఫోటో)



Read More: విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు, స్థానికులు సైతం మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి కారణం ఏంటన్న విషయం ఇంకా తెలియలేదు. మెకానిక్ షెడ్‌లో మంటలు ఎలా వ్యాపించాయి అన్న దానిపై విచారణ చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.