యాప్నగరం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. హర్యానాలోని బల్లబ్‌గఢ్ స్టేషన్ వద్ద గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.

Samayam Telugu 29 Aug 2019, 11:08 am
హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళుతున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌‌కు పెను ప్రమాదం తప్పింది. రైలులోని రెండు బోగీల్లో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. హర్యానాలోని బల్లబ్‌గఢ్‌ వద్ద గురువారం ఉదయం 7.43 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముందుగా పొగ రావడాన్ని గమనించిన లోకో పైలట్ వెంటనే అప్రమత్తమై రైలును అక్కడే నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు సురక్షితంగా కిందకి దిగిపోయారు.
Samayam Telugu Fire in Telangan Express


ఏసీ బోగీలో షార్ట్‌ సర్క్యూట్ కావడంతోనే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ముందుగా బీ-1 బోగీలో చెలరేగిన మంటలు ఆ తర్వాత ఎస్-10 బోగీకి వ్యాపించాయి. ప్రయాణికులు దిగిపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఓ బోగీ మాత్రం పూర్తిగా దగ్ధమైంది. అయితే ఏమాత్రం ఏమరపాటుగా వ్యవహరించినా ఊహించని ప్రాణ నష్టం జరిగి ఉండేది.

Read Also: ప్రాణం తీసిన ఫేస్‌బుక్ పరిచయం.. జడ్చర్లలో బాలిక దారుణ హత్య

ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు ఉత్తర రైల్వే సీపీఆర్వో ఓ ప్రకటనలో తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.