యాప్నగరం

హైాదరాబాద్‌లో తొలిసారిగా ఆన్ లైన్ ఎగ్జిబిషన్.. రేపట్నుంచి ప్రారంభం

హైదరాబాద్‌లో ఇంతవరకు ఎన్నో ఎగ్జిబిషన్‌లో జరిగాయి. ప్రతీ ఏడాది నగరంలో ఏదో ఓ చోట ఎక్స్ పో నడుస్తూనే ఉంటుంది. తాజాాగా తొలిసారిగా హైదరాబాద్‌లో ఆన్ లైన్ ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది.

Samayam Telugu 14 Jul 2020, 12:14 pm
కరోనా వైరస్ భయంతో ప్రజలు ఇళ్లు కదలడం లేదు. మరీ అవసరం అయితే తప్పా. పాలు నీళ్లు అవసరం అయితేనే బయటకు అడుగు పెడుతున్నారు. కొందరైతే బయటకెళ్లి రిస్క్ తెచ్చుకోవడం ఎందుకులే అని కావాల్సిన వస్తువుల్ని ఆన్ లైన్‌లోనే తెప్పించుకుంటున్నారు. ఇంటి సరుకులతో పాటు.. నిత్యావసరాలు, బట్టలు, ఇంటికి అవసరమైన వస్తువులు అన్నీ ఆన్ లైన్‌లోనే బుక్ చేసుకుంటున్నారు. కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటూ బోర్‌గా ఫీలవుతున్నారు వారికోసం ఓ గుడ్ న్యూస్ వచ్చింది. రేపట్నుంచి అంటే బుధవారం నుంచి ఆన్ లైన్ ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. అల్ హాడి ఇస్లామిక్ ఎక్స్‌పో, సూపర్ ముస్లిమా మొట్టమొదటి ఆన్‌లైన్ ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
hyderabad online exhibition


ఈ ప్రదర్శనలో ఫ్యాషన్, ఆహారం, జీవనశైలిని నేపథ్యంలో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శన జూలై 15 నుంచి 25 వరకు ఉంటుంది. పది రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శన అంతా సరదాగా, ఆనందంగా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇందులో ఉపకరణాలు, అలంకరణలతో కూడిన వస్తువులు, దుస్తులు, ఆహారం, బేకరీ వస్తువులు, బిర్యానీలు కూడా అందుబాటులో ఉండనున్నాయి.
Read More: హోం ఐసోలేషన్‌ కిట్‌లో మందులు లేవని కాల్ చేస్తే.. షాకింగ్ రెస్పాన్స్

వినియోగదారుల కోసం ఈ ఎగ్జిబిషన్‌లో 100కుపైగా డిజైనింగ్‌ వస్త్రాలను అందిస్తున్నారు. అంతేకాదు చక్కగా అలంకరించిన వస్తువులను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ఆన్‌లైన్‌ ఎగ్జిబిషన్‌ అందరినీ ఆకట్టుకుంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్‌లో షాపింగ్ చేసినవారు తమకు కావాల్సిన వస్తువును స్క్రీన్‌ షాట్‌ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్ నెంబర్‌కు పంపాల్సి ఉంటుంది. అప్పుడు ఆ వస్తువును సిబ్బంది హోం డెలివరీ చేస్తారని నిర్వాహకులు తెలిపారు. మరి ఇంకెందుకు ఆలస్యం రేపట్నుంచి ప్రారంభం కానున్న ఈ ఆన్ లైన్ ఎక్స్ పోపై ఓ లుక్కేయండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.