యాప్నగరం

ఖమ్మం: తాగునీటి కోసం వెళ్లి బావిలో పడ్డ ఐదుగురు మహిళలు

Khammam: కొణిజర్ల మండల కేంద్రానికి చెందిన 9 మంది మహిళా కూలీలు ఆదివారం ఉదయం నాట్లు వేసేందుకు పొలాలకు వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో తాగునీటి కోసం అందరూ వ్యవసాయబావి వద్దకు వెళ్లారు.

Samayam Telugu 2 Aug 2020, 6:09 pm
ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొణిజర్లలోని ఓ వ్యవసాయ బావిలో ఐదుగురు మహిళలు పడ్డారు. వీరిలో నీట మునిగి ఇద్దరు చనిపోయారు. మరో ముగ్గురిని కాపాడి చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు చెప్పారు. అయితే, ఈ మహిళలు తాగునీటికోసం బావి వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. ముగ్గురిని సహచర మహిళ చీర సాయంతో బయటకు లాగి ప్రాణాలు కాపాడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Samayam Telugu మహిళలు పడిపోయిన వ్యవసాయ బావి
khammam


కొణిజర్ల మండల కేంద్రానికి చెందిన 9 మంది మహిళా కూలీలు ఆదివారం ఉదయం నాట్లు వేసేందుకు పొలాలకు వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో తాగునీటి కోసం అందరూ వ్యవసాయబావి వద్దకు వెళ్లారు. మొదటి నలుగురు నీళ్లు తాగి ఒడ్డుకు రాగా.. మిగతా ఐదుగురు బావి సమీపానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు ఒడ్డు కూలింది. దీంతో ఐదుగురు మహిళలు బావిలోపడ్డారు.

చింతల ఎల్లమ్మ అనే మహిళ తెలివిగా వ్యవహరించి తన చీరసాయంతో చింతల మమత, తద్దె నాగమణి, తద్దె మౌనీకను బయటకు లాగింది. అప్పటికే నీట మునిగిన తుప్పతి పెద్దరమా (38), బండారు మల్లిక(30) అనే ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.