యాప్నగరం

జూరాల, శ్రీశైలానికి పోటెత్తున్న వరద నీరు

Jurala Project: జూరాల ప్రాజెక్టుకు 9.657 టీఎంసీల నీటి నిల్వ ఉండగా ప్రస్తుతం నీటి నిలువ 9.542 టీఎంసీలు ఉంది. ఇన్ ఫ్లో 62,500 క్యూసెక్కులు ఉండగా 8 గేట్ల ద్వారా 42,614 క్యూసెక్కుల నీటిని దిగువకు జూరాల అధికారులు విడుదల చేస్తున్నారు.

Samayam Telugu 15 Jul 2020, 9:09 pm
కర్ణాటక, మహారాష్ట్రలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహం పోటెత్తుతోంది. జూరాల ప్రాజెక్టుకు 9.657 టీఎంసీల నీటి నిల్వ ఉండగా ప్రస్తుతం నీటి నిలువ 9.542 టీఎంసీలు ఉంది. ఇన్ ఫ్లో 62,500 క్యూసెక్కులు ఉండగా 8 గేట్ల ద్వారా 42,614 క్యూసెక్కుల నీటిని దిగువకు జూరాల అధికారులు విడుదల చేస్తున్నారు.
Samayam Telugu జూరాల ప్రాజెక్టు
Jurala Project


జల విద్యుత్ ఉత్పత్తి కోసం 21,128 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి-750, బీమా-1 కు 650, కోయిల్ సాగర్ 630, కుడి ఎడమ కాలువ 985 సమాంతర కాలువ ద్వారా 800, బీమా ఎత్తిపోతల పథకం-2 ద్వారా 750 క్యూసెక్కుల నీటిని జూరాల అధికారులు శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు ఇంకా వరద ప్రవాహం భారీగా ఉంటుందని జూరాల అధికారులు తెలిపారు.

మరోవైపు, శ్రీశైలం ప్రాజెక్టుకు సైతం వరద ప్రవాహం పెరిగింది. కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. బుధవారం ఉదయం 49,895 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తున్నట్టు అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు

జురాల ప్రాజెక్టు నుంచి 48,795 క్యూసెక్కులు, హంద్రీనీవా నుంచి 1,100 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 815.50 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 37.6570 టీఎంసీలుగా నవెూదైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.