యాప్నగరం

సీబీఐ విచారణకూ సిద్దమే: ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు

తెలంగాణ విద్యుత్ శాఖలో కుంభకోణం జరిగిందని బీజేపీ నేత లక్ష్మణ్ చేసిన ఆరోపణలను జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు ఖండించారు. విద్యుత్ ఒప్పందాలన్నీ పారదర్శకంగా జరిగాయనీ, అనుమానాలు ఉంటే సీబీఐ విచారణకు కూడా సిద్ధమని ప్రకటించారు.

Samayam Telugu 23 Aug 2019, 7:22 pm
తెలంగాణ విద్యుత్‌ శాఖలో భారీ కుంభకోణం జరిగిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు స్పందించారు. తెలంగాణ విద్యుత్‌పై అవగాహన లేకపోవడంతో లక్ష్మణ్ ఆ వ్యాఖ్యలు చేశారన్నారు. విద్యుత్ సౌధలో ఆయన శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ నేత లక్ష్మణ్ చేప్పినవన్నీ అవాస్తవాలన్నారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. తమపై అనుమానాలు ఉంటే సీబీఐ విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు.
Samayam Telugu CMD


తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 71 మెగా వాట్ల సోలార్ పవర్ మాత్రమే ఉండేదనీ, ప్రసుత్తం అది 3,600 మెగావాట్లకు చేరిందని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. లక్ష్మణ్ ఆరోపించినట్లు ఎన్టీపీసీ రూ. 4.30 పైసలకే విద్యుత్ సరఫరా చేస్తామని ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం చత్తీస్‌గఢ్ నుంచి రూ. 3.90 పైసలకే కొనుగోలు చేస్తున్నామన్నారు.

Read Also: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్.. బీజేపీలోకి మాజీ ఉప ముఖ్యమంత్రి?

800 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టును 48 నెలల్లో ప్రారంభించామని సీఎండీ గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టును దేశవ్యాప్తంగా ప్రముఖులు సందర్శించారని తెలిపారు. రాత్రికి రాత్రే పీపీఏలు చేసుకున్నారనదే అవాస్తమని ప్రభాకర్ రావు కొట్టిపారేశారు. విద్యుత్ సంస్థలు స్వతంత్రంగా ఉంటాయనీ, ఎవరి ఒత్తళ్లకు లొంగకుండా పనిచేస్తాయన్నారు. విద్యుత్ ఉద్యోగుల పనితీరుపై అవాస్తవాలు ప్రచారం చెయ్యొద్దని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.