యాప్నగరం

మంత్రి తలసానికి జీహెచ్ఎంసీ ఝలక్.. హోర్డింగ్‌లు పెట్టినందుకు ఫైన్

Talasani Srinivas Yadav: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు జీహెచ్ఎంసీ ఝలక్ ఇచ్చింది. హైదరాబాద్‌లోని పలు ప్రధాన కూడళ్లలో అనుమతి లేకుండా దసరా, బతుకమ్మ శుభాకాంక్షలకు సంబంధించిన హోర్డింగ్‌లు పెట్టినందుకు గానూ.. తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు జీహెచ్‌ఎంసీ జరిమానా విధించింది. మంత్రితో పాటు పలువురు నాయకులకు కూడా ఫైన్‌లు పడ్డాయి. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హోర్డింగులకు గానూ.. తలసాని శ్రీనివాస్ పేరిట మొత్తంగా రూ.20,000 చలాన్లు జారీ చేసింది.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 4 Oct 2022, 6:24 pm
Samayam Telugu srinivas
తలసాని శ్రీనివాస్ యాదవ్‌
Talasani Srinivas Yadav: పండుగలొచ్చాయంటే చాలు.. గల్లీలు, ప్రధాన కూడళ్లలో లీడర్ల శుభాకాంక్షలతో హోర్డింగు (Hoardings) లు వెలుస్తాయి. ఆ హోర్డింగులు గల్లీల్లో తిరిగే చోటా మోటా లీడర్ల నుంచి మొదలు.. మంత్రుల వరకు ఉంటాయి. అయితే.. గల్లీల్లో పెట్టే ఫ్లెక్సీల సంగతేమో కానీ.. ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసే హోర్డింగులకు మాత్రం పర్మిషన్లు తీసుకోవాల్సిందే. లేదంటే.. జరిమానా (Fines) ల మోత మోగుతుంది. ఇప్పుడు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు కూడా అదే జరిగింది. దసరా (Dussehra), బతుకమ్మ (Bathukamma) పండుగల సందర్భంగా.. తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరుతో ప్యాట్నీ (Patny Centre), ట్యాంక్‌‌బండ్ (Tank Bund) రోడ్డులో భారీ హోర్డింగులు వెలిశాయి. అయితే ఆ బ్యానర్లపై జీహెచ్ఎంసీ (GHMC) కి సాధారణ పౌరుల నుంచి ఫిర్యాదులు (Complaints) వెల్లువెత్తాయి. పెద్దఎత్తున వచ్చిన ఫిర్యాదుల మేరకు జీహెచ్ఎంసీ చర్యలకు ఉపక్రమించింది.

సికింద్రాబాద్‌లోని ప్యాట్నీ సర్కిల్‌, ట్యాంక్‌బండ్‌ రోడ్డులో అనుమతి లేకుండా బ్యానర్లు ఏర్పాటు చేసిన మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌కు జీహెచ్‌ఎంసీ జరిమానా విధించింది. దసరా, బతుకమ్మ పండుగలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన భారీ బ్యానర్ల ఫొటోలను ట్విట్టర్ వేదికగా.. జీహెచ్ఎంసీకి నెటిజన్లు ఫిర్యాదు చేశారు. వాహనారులకు, పాదాచారులకు ఇబ్బంది కలిగేలా ఏర్పాటు చేసిన హోర్డింగులపై చర్యలు తీసుకోవాలంటూ.. ట్వీట్లు చేశారు. ఆ ట్విట్లకు స్పందించిన సంబంధింతి డిపార్ట్‌మెంట్ అధికారులు.. తలసాని శ్రీనివాస్ పేరిట మొత్తం రూ.20,000 చలాన్లు జారీ చేశారు. అందుకు సంబంధించిన ఈ-చలానాలను కూడా ట్వీట్ చేశారు. పాట్నీలో మంత్రి పుట్టిన రోజు కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై తలసాని రవీందర్ యాదవ్‌కు మరో రూ.5000 చలాన్ వేశారు. శ్రీనివాస్ యాదవ్‌కు ప్యాట్నీ దగ్గర ఒక బ్యానర్, ట్యాంక్ బండ్ రోడ్డు సమీపంలోని మూడు బ్యానర్‌లకు రూ.5000 చొప్పున జరిమానా విధించారు.

గతంలో 2021 అక్టోబర్‌లో కూడా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డితో పాటు జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్ సహా పలువురు టిఆర్‌ఎస్ నాయకులకు భారీగానే జరిమానాలు పడ్డాయి. టీఆర్‌ఎస్‌ స్థాపించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారీ ఎత్తున బ్యానర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఫిర్యాదుల ఆధారంగా చాలా మంది టీఆర్‌ఎస్ నాయకులపై రూ. 5,000 నుండి రూ. 2 లక్షల వరకు జీహెచ్ఎంసీ జరిమానాలు విధించింది.

రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.