యాప్నగరం

రీడర్‌గానే నాకు సంతోషం: గవర్నర్ తమిళిసై

Hyderabad Book Fair: గవర్నర్, రచయిత, డాక్టర్ అయినప్పటికీ.. తనకూ రీడర్‌గానే చాలా సంతోషమని గవర్నర్ తమిళిసై అన్నారు. హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ప్రారంభించి తెలుగులో స్పీచ్ మొదలుపెట్టారు.

Samayam Telugu 24 Dec 2019, 12:56 am
పుస్తకం చదవకుండా తనకు ఒక్క రోజు కూడా గడవదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. ఒక గవర్నర్, రచయిత, డాక్టర్ అయినప్పటికీ తనకూ రీడర్‌గానే చాలా సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించుకోవాలని అందరూ భావిస్తారని.. కానీ, ఒక రీడింగ్ రూమ్ ఉండేలా ఇల్లు కట్టుకోవాలనుకునే వారు చాలా అరుదని ఆమె అన్నారు. ఇంట్లో ఓ రీడింగ్ రూమ్ ఉండేలా చూసుకోవాలని పిలుపునిచ్చారు.
Samayam Telugu book fair


ఎన్టీఆర్ స్టేడియంలో సోమవారం (డిసెంబర్ 23) 33వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు. తెలుగులో స్పీచ్ ప్రారంభించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరి శంకర్ పాల్గొన్నారు.

పుస్తక ప్రదర్శనకి రావడం చాలా సంతోషంగా ఉందని గవర్నర్ పేర్కొన్నారు. ‘ఇక్కడ ఉన్న అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా.. నన్ను కలవడానికి వస్తే.. ఒక పుస్తకం తీసుకురండి. జీవితంలో పుస్తకం చదవడం చాలా ముఖ్యమైన పని. నేను ఉంత బిజీగా ఉన్నా.. రోజూ పడుకునే ముందు ఒక గంట పాటు పుస్తకం చదువుతాను’ అని తమిళిసై తెలిపారు.

‘అందరినీ పుస్తక పఠనం చేయాలని కోరుతున్నా. యువత ఇక్కడున్న 330 బుక్ స్టాల్స్‌ను సందర్శించాలి’ అని గవర్నర్ పిలుపునిచ్చారు. పుస్తకాలు చదవడంలో సీఎం కేసీఆర్ అందరికీ ఆదర్శమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమం రావడానికి కారణమే కేసీఆర్ పుస్తకాలు చదవడమని పేర్కొన్నారు.

మొక్కల పంపిణీ ప్రారంభించిన గవర్నర్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా మొక్కల పంపిణీ చేసే కార్యక్రమాన్ని గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. కార్యక్రమాన్ని ప్రారంభించి తొలి మొక్కను స్వీకరించారు. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మంచి కార్యక్రమం చేస్తున్నారని సంస్థ ప్రతినిధులను గవర్నర్ అభినందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.