యాప్నగరం

అమిత్ షాతో తెలంగాణ గవర్నర్ భేటీ.. తమిళిసైకి ప్రధాని అభినందనలు

తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. తాను గవర్నర్‌గా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. గవర్నర్‌ను ప్రధాని ప్రశంసించారు.

Samayam Telugu 15 Oct 2019, 10:26 pm
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తమిళిసై మంగళవారం (అక్టోబర్ 15) రాత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను హోం మంత్రికి వివరించినట్లు సమాచారం.
Samayam Telugu shah


తెలంగాణ గవర్నర్‌గా తాను పాల్గొన్న సామాజిక కార్యక్రమాలు, బతుకమ్మ సంబరాలపై అమిత్ షాకు గవర్నర్ తమిళిసై ప్రతులను సమర్పించారు. అంతకుముందు ఆమె ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ ఆయ్యారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌లో చేపట్టిన వినూత్న అంశాలపై ప్రధానికి నివేదిక అందించారు.

రాజ్‌భవన్‌లో తాను చేపట్టిన ప్లాస్టిక్ నిషేధం, యోగా తరగతులు, రక్తదానశిబిరం తదితర కార్యక్రమాలపై ప్రధానికి నివేదిక ఆందించగా.. గవర్నర్‌ తమిళిసైని ఆయన అభినందించారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తమిళిసై ప్రధానితో భేటీ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆర్టీసీ సమ్మెతో తెలంగాణ అట్టుడుకుతున్న నేపథ్యంలో గవర్నర్ తమిళిసై.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.