యాప్నగరం

సీఎం కేసీఆర్‌తో గుజరాత్‌ మాజీ సీఎం భేటీ.. ఆ అంశాలపైనే చర్చ..

KCR National Party: హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింఘ్ వాఘేలా భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న కేసీఆర్‌తో శంకర్ సింఘ్ వాఘేలా సమావేశం కావటం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటు కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టేందుకు పావులు కదుపుతుండగా.. అటు శంకర్ సింఘ్ వాఘేలా కొత్త పార్టీ పెడుతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి భేటీ కావటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 16 Sep 2022, 5:03 pm
KCR National Party: జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సన్నద్ధమవుతోన్న తెలంగాణ సీఎం కేసీఆర్ (K Chandrashekar Rao).. అందుకోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దేశంలోని పలు ప్రాంతీయ పార్టీలను ఏకతాటి మీదికి తీసుకురావటంతో పాటు తాను పెట్టబోయే కొత్త జాతీయ పార్టీ (KCR National Party) కి మద్దతు కూడగట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.. భాజపా ముక్త్ భారత్ నినాదంతో ముందుకెళ్తోన్న కేసీఆర్.. తనతో నడిచే పలు పార్టీల నాయకులతో వరుసగా భేటీ అవుతున్నారు. మరికొందరిని హైదరాబాద్‌కు ఆహ్వానించి సమాలోచనలు జరుపుతున్నారు. మొత్తానికి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు.

సీఎం కేసీఆర్‌తో గుజరాత్‌ మాజీ సీఎం భేటీ

Samayam Telugu CM KCR
కేసీఆర్‌తో గుజరాత్ మాజీ సీఎం

ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో గుజరాత్ (Gujarat) మాజీ సీఎం శంకర్ సింఘ్ వాఘేలా (Shankar Singh Vaghela) భేటీ అయ్యారు. హైదరాబాద్ ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సమావేశమైన శంకర్ సింఘ్ వాఘేలా.. దేశ రాజకీయాలు, జాతీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రాంతీయ పార్టీలన్ని కలిసి జాతీయ స్థాయిలో పెనుమార్పు తీసుకురావాలని భేటీలో నిర్ణయించినట్టు సమాచారం. బీజేపీ వైఫల్యాలు, మతతత్వ రాజకీయాలు అనే అంశాలను దేశవ్యాప్తంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే విషయం గురించి ఇరువురు మాట్లాడినట్టు తెలుస్తోంది.

సీఎం కేసీఆర్‌తో గుజరాత్ మాజీ సీఎం భేటీ

గులాబీ బాస్ కేసీఆర్ త్వరలోనే జాతీయ పార్టీని ప్రకటించేందుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. ఎప్పుడు ప్రకటిస్తున్నారని అధికారికంగా ప్రకటించకపోయినా.. దసరాలోపు పార్టీని ఏర్పాటు చేస్తారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటు శంకర్ సింఘ్ వాఘేలా కూడా కొత్త పార్టీ పెట్టనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. త్వరలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో.. కొత్తగా పెట్టే పార్టీ నుంచే రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో(182) అభ్యర్థులను బరిలో దింపుతానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలిసి భేటీ కావటంపై రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.