యాప్నగరం

షాక్ అవుతారనే చెప్పలేదు.. కరోనా పేషెంట్ అంత్యక్రియలపై ఈటల వివరణ

కుటుంబీకులకు చెప్పకుండా కరోనా పేషెంట్ అంత్యక్రియలు నిర్వహించిన విషయమై ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. షాక్ అవుతారనే కారణంతోనే వెంటనే వారికి చెప్పలేదన్నారు.

Samayam Telugu 21 May 2020, 2:28 pm
కుటుంబ సభ్యులెవరికీ సమాచారం ఇవ్వకుండానే.. గాంధీ హాస్పిటల్‌లో మరణించిన కరోనా పేషెంట్‌కు అంత్యక్రియలు నిర్వహించిన విషయమై ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వివరణ ఇచ్చారు. మధుసూదన్ తండ్రి హాస్పిటల్‌లో చేరిన 24 గంటల్లోనే చనిపోయారన్న ఈటల.. ఆయన కుమారుడు అదే రోజు హాస్పిటల్‌లో చేరి మే 1న మరణించారని తెలిపారు. మధుసూదన్ చనిపోయిన విషయాన్ని పోలీసులకు తెలిపామని.. ఆయన భార్యకు తెలిస్తే తట్టుకోలేరనే ఉద్దేశంతోనే చెప్పలేదన్నారు.
Samayam Telugu ఈటల


మృతదేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచే పరిస్థితి లేదన్న ఈటల.. మధుసూదన్ మరణవార్తను కుటుంబీకులు తట్టుకోలేరని సన్నిహితులే చెప్పారన్నారు. అంతే కాకుండా కుటుంబ సభ్యులందరూ హాస్పిటల్‌లోనే ఉండటంతో.. ప్రభుత్వం తరఫున అంత్యక్రియలు నిర్వహించామన్నారు.

అప్పట్లో కరోనా కారణంగా చనిపోయిన వారి అంత్యక్రియలు చేయడానికి అంతా భయపడిన విషయాన్ని గుర్తు చేసిన ఈటల.. ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తర్వాత ప్రభుత్వంపై ఇలా మాట్లాడటం సరికాదన్నారు. కరోనా బారిన పడి హాస్పిటల్‌లో చేరిన తన భర్త జాడ కనిపించడం లేదని మధుసూదన్ భార్య ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయమై గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇప్పటికే వివరణ ఇచ్చారు. మంత్రికి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసిన మధుసూదన్ భార్యను ఫోన్లో సంప్రదించడానికి చాలా మంది ప్రయత్నించగా.. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అని రావడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.