యాప్నగరం

జూరాల ప్రాజెక్టుకు మరోసారి వరద.. 25 గేట్లు ఎత్తేసిన అధికారులు

మరోసారి జూరాల ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టుకు చెందిన 25 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు.

Samayam Telugu 27 Aug 2020, 10:48 am
తెలంగాణలో రెండు రోజులుగా ప్రాజెక్టులకు వరద నీరు తగ్గుముఖం పట్టింది. తాజాగా జూరాల ప్రాజెక్ట్‌కు మరోసారి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. పూర్తిస్థాయి 318.516 మీటర్లకు గాను... ప్రస్తుత నీటిమట్టం 318.370 మీటర్లుగా ఉంది. అలాగే ప్రస్తుత నీటి నిల్వ 9.357 టీఎంసీలకు గాను... పూర్తిస్థాయి 9.657 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ 25 గేట్లు ఎత్తిశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 2,15,000 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 2,12,392 క్యూసెక్కులుగా ఉంది.
Samayam Telugu జూరాల ప్రాజెక్టుకు వరద
jurala project


ఇటీవల కురిసిన భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. జలాశయాలు, నదులు నిండుకోవడంతో పాటు వరద నీరు ఇళ్లలోకి కూడా చేరింది. దీంతో అనేక ప్రాంతాల్లో జనం అవస్థలు పడ్డారు. తాజాగా వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడగా...దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలంగాణలో మూడు రోజులపాటు పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.