యాప్నగరం

సద్దుల బతుకమ్మ రోజునా వదలని వాన.. భాగ్యనగరంలో భారీ వర్షం

భాగ్యనగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. ఆదివారం మధ్యాహ్నం నగరంలోని పలు ప్రాంతాల్లో జోరు వర్షం కురిసింది. దీంతో కొన్ని కాలనీలు జలమయం అయ్యాయి.

Samayam Telugu 6 Oct 2019, 3:19 pm
హైదరాబాద్ మహానగరాన్ని మరోసారి వర్షం ముంచెత్తింది. బతుకమ్మ పండుగ కోసం భాగ్యనగర మహిళలు సన్నద్ధం అవుతున్న వేళ.. ఆదివారం మధ్యాహ్నం నగర వ్యాప్తంగా వర్షం కురిసింది. భారీ వర్షం కురవడంతో.. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పంజాగుట్ట, బేగంపేట, కేపీహెచ్‌‌బీ, అబిడ్స్, నాంపల్లి, ముషీరాబాద్‌, అంబర్‌పేట, నాగోల్‌, బండ్లగూడ, దిల్‌సుఖ్‌ నగర్‌, మలక్‌పేట, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, సైదాబాద్‌, చంపాపేట్‌, సరూర్‌నగర్‌, తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది.
Samayam Telugu rain on bathukamma day


కుండపోత వర్షం సుందరయ్య పార్కు సమీపంలో మోకాళ్ల లోతు వరద నీరు చేరింది. దీంతో బైకులు నీటిలో కొట్టుకుపోయాయి. భారీగ వర్షం కురవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉద్యోగులు వర్షం కష్టాల నుంచి తప్పించుకున్నారు.
కానీ బతుకమ్మ పండుగ కోసం బతుకమ్మలను సిద్ధం చేస్తున్న మహిళలు మాత్రం ఒకింత ఆందోళన చెందారు. సాయంత్రం కూడా వర్షం కురిస్తే.. బతుకమ్మ సంబరాలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. స‌ద్దుల బ‌తుక‌మ్మ‌ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఆదివారం నాడు భారీ సంఖ్య‌లో మ‌హిళ‌లు బతుకమ్మ ఆడనున్నారు. ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వ‌ర‌కు బతుకమ్మ శోభాయాత్ర నిర్వ‌హించి బ‌తుక‌మ్మ‌ ఘాట్‌లో బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.