యాప్నగరం

16 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

Samayam Telugu 20 Aug 2020, 10:59 am
తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానాలకు ఏపీ తెలంగాణ తడిసి ముద్దయ్యయి. భారీ వర్షాలతో రెండు రాష్ట్రాల్లో వాగులు, వంకలు, నదులు, చెరువులు నిండుకున్నాయి. అయితే మరిన్ని వానలు పడతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురియనున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది తీవ్ర అల్పపీడనంగా మారి వాయువ్య బంగాళాఖాతంలో, దాని పరిసర ప్రాంతాలో కేంద్రీకృతమైంది. 7.6 కిలోమీటర్‌ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, ఇది పశ్చిమ దిశగా ప్రయాణించి రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
Samayam Telugu తెలంగాణకు భారీ వర్ష సూచన
telangana rains

Read More: తెలంగాణ ప్రాజెక్టులకు జలకళ.. ప్రముఖ జలాశయాల గేట్ల ఎత్తివేత
ఈ ప్రభావంతో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని 16 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని తెలిపింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, కోమురంభీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్‌, పెద్దపల్లి, ములుగు, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, మహబూబాబాద్‌, భద్రాది కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో ఈ రోజు ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.
Read More: హోంఐసోలేషన్‌లో బాధితుల కష్టాలు.. మూడురోజుల తర్వాత కరోనా కిట్లుఇవాళ రేపు తెలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు బంగాళాఖాతంలో ఆగస్టు 23వ తేదీన మరోసారి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇప్పటికే భారీ వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరదలకు అనేక ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు, మంత్రులు, నాయకులు బాధితుల్ని పరామర్శించారు. ఇటు సీఎం కేసీఆర్ కూడా తెలంగాణలో వర్షాలు, వరదలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.