యాప్నగరం

Hyderabad: మళ్లీ కుండపోత.. ట్రాఫిక్ జామ్‌తో నరకం

భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల చెట్లు కూలిపోయాయి.

Samayam Telugu 30 Sep 2019, 8:04 pm
భాగ్యనగరంలో పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. సోమవారం (సెప్టెంబర్ 30) మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం వరకు పలుమార్లు భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. పలు చోట్ల వాహనాలపై, రోడ్లకు అడ్డంగా చెట్లు కూలిపోయాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. లోతట్టు ప్రాంతాలలోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హుస్సేన్ సాగర్ జలమట్టం అంతకంతకూ పెరుగుతోంది.
Samayam Telugu rain


ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీల నుంచి ఇంటికి తిరిగెళ్లే సమయంలో భారీ వర్షం కురవడంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లక్డీకాపూల్ నుంచి మాసాబ్ ట్యాంక్ వరకు, అటు మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. రాణిగంజ్ జంక్షన్ వద్ద, ట్యాంక్ బండ్ పైనా వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. లిబర్టీ నుంచి నారాయణగూడ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది.

హిమాయత్ నగర్, బషీర్ బాగ్, నారాయణగూడ, హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, ప్యాట్నీ, బోయిన్‌పల్లి తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Don't Miss: పోలీసులకు ఆర్నెళ్ల జైలు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, సికింద్రాబాద్‌, చిలకలగూడ, పద్మారావు నగర్‌, పార్సీగుట్ట కూకట్‌పల్లి, ట్యాంక్‌బండ్‌, హిమాయత్‌నగర్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రానున్న 48 గంటల్లో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.