యాప్నగరం

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో మరింతగా వానలు..

Telangana Weather: అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. మరి కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Samayam Telugu 27 Aug 2020, 9:30 pm
గత వారం రోజులుగా కాస్త తెరిపించిన వానలు మళ్లీ మొదలు కానున్నట్లు వాతావరణ అధికారులు అంచనా వేశారు. నైరుతి జార్ఖండ్ దాని పరిసర ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని చెప్పారు. దీనికి అనుబంధంగా 7.6 కిమీమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని వివరించారు. ఉత్తర-దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఇది కొనసాగుతోందని, దీని ప్రభావంతో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. మరి కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Rains in Hyd


సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, జనగామ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

Also Read: undefined

Must Watch: వీడియో: రెప్పపాటులో బైక్ యాక్సిడెంట్.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్.. భయానక దృశ్యాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.