యాప్నగరం

చివరి క్షణంలో ఆకలి అని అరిచిన హేమంత్.. న్యాయం కోసం సజ్జనార్‌ను కలవనున్న కుటుంబం

హేమంత్ హత్యకు ముందుగా లక్ష అడ్వాన్స్ తీసుకున్నారు. ఆకలి అని అరిచినా విడిచిపెట్టకుండా హేమంత్‌ ప్రాణం తీశారు. అనంతరం అతడి చేతికి ఉన్న బ్రెసిలెట్2ను కూడా కిరాయి హంతకులు కాజేశారు.

Samayam Telugu 27 Sep 2020, 11:52 am
ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్న పాపానికి హేమంత్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అమ్మాయి తరపు వారు హేమంత్‌ని కిడ్నాప్ చేసి హత్య చేశారు. దీంతో న్యాయం కోసం రేపు సీపీ సజ్జనార్ ని కలవనున్నారు హేమంత్ కుటుంబం. తమకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలని కోరనున్నారు. కిరాయి రౌడీలతో హేమంత్ అతిదారుణంగా హత్య చేశారు. మొహం మీద దాడి చేస్తూ కారులోనే ప్రాణం తీశారు. కిరాయి రౌడీలు హేమంత్‌ను తాడుతో కాళ్లు, చేతులు కట్టేసి, మెడకి తాడు బిగించి హత మార్చిన విషయం తెలిసిందే.
Samayam Telugu సజ్జనార్‌ను కలవనున్న హేమంత్ కుటుంబం
Hemanth murder case


హేమంత్ చనిపోయిన అనంతరం అతని చేతికి ఉన్న బ్రెసిలెట్ ను కాజేశారు. హేమంత్ చనిపోయే చివరి క్షణంలో ఆకలి అని అరిచినా హంతకులు కనికరించలేదు. ముక్కు మొహం మీద పిడిగుద్దులు గుద్దారు.హేమంత్ హత్య కేసులో కీలక నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. మొత్తం 18 మంది ఈ హత్యకు కారకులయ్యారు. అందులో ముఖ్యంగా 18 మంది నిందితుల్లో ఎ5 కృష్ణ, ఎ6 బాషా ఉన్నారు. ఎ17 జగన్ ఎ18 సయ్యద్ మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ఎ1 యుగేంధర్‌ రెడ్డితో కలిసి కృష్ణ, ఎ4 బిక్షపతి యాదవ్ హేమంత్ ను హత్య చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.

Read More: బండి సంజయ్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చేరిక ?

హేమంత్ హత్య తర్వాత జగన్, సయ్యద్ నిందితులకు సహకరించారు. ఎ2లక్షారెడ్డి వద్ద నుంచి లక్ష అడ్వాన్స్ గా బిక్షపతి, కృష్ణ,బాషా తీసుకున్నారు. హత్య తరవాత మిగతా డబ్బు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు.నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.అయితే ఈ కేసుకు సంబంధించిన నిందితులను వదిలి పెట్టకూడదని, తమకు న్యాయం కావాలంటూ రేపు సీపీ సజ్జనా‌ర్‌ను హేమంత్ కుటుంబసభ్యులు కలవనున్నారు. హేమంత్ భార్య అవంతి కూడా ఇప్పటికే నిందితులు ఎవరైనా సరే వారిని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేసింది. తనకు న్యాయం చేయాలని కోరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.