యాప్నగరం

పట్టభద్రుల ఓట్ల నమోదుకు మరో ఛాన్స్.. ఈసీకి హైకోర్టు ఆదేశం

TS High Court: కరోనా వ్యాప్తి నేపథ్యంలో పట్టభద్రుల ఓటు నమోదు గడువును డిసెంబరు 7 వరకు పెంచాలని రమేష్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది.

Samayam Telugu 6 Nov 2020, 7:52 pm
తెలంగాణ ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలని ఆదేశించింది. అయితే, కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని, డిసెంబరు 1 నుంచి 31 వరకు ఓటు నమోదు అవకాశం కల్పిస్తామని ఎన్నికల కమిషన్‌ కోర్టుకు తెలిపింది. ఈ మేరకు కొత్తగా మరో నోటిఫికేషన్‌ జారీ చేస్తామని వెల్లడించింది.
Samayam Telugu తెలంగాణ హైకోర్టు (ఫైల్ ఫోటో)
telangana high court


కరోనా వ్యాప్తి నేపథ్యంలో పట్టభద్రుల ఓటు నమోదు గడువును డిసెంబరు 7 వరకు పెంచాలని రమేష్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో పట్టభద్రుల ఓటు నమోదు గడువు నేటితోనే (నవంబర్ 6) ముగుస్తుందని ఎన్నికల కమిషన్‌ కోర్టుకు తెలిపింది. చట్ట ప్రకారం నవంబరు 7లోపే ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందని స్పష్టం చేసింది. ఒకవేళ ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చనని పేర్కొంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో మరోసారి అవకాశం కల్పించనున్నట్లు ఈసీ వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.