యాప్నగరం

కిందికుంట చెరువు ఆక్రమణ.. కలెక్టర్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు

చెరువు కబ్జా విషయమై దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించింది. చెరువు ఆక్రమణలు ఏవైనా ఉంటే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించింది.

Samayam Telugu 5 Aug 2020, 3:36 pm
హైదరాబాద్: కూకట్‌పల్లి కిందికుంట చెరువు ఆక్రమణల విషయమై విచారణ జరిపి ఆగష్టు 13న నివేదిక ఇవ్వాలని మేడ్చల్ కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. కిందికుంట చెరువు కబ్జాకు గురవుతోందని దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. కిందికుంట చెరువును పరిశీలించి ఆక్రమణలుంటే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చెరువులు కబ్జా అవుతుంటే కలెక్టర్లు ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది.
Samayam Telugu telangana High court
Telangana high court


చెరువు అభివృద్ధి పేరిట మట్టితో పూడ్చేందుకు కొందరు ప్రయత్నించారని.. ఈ పనులను అడ్డుకున్న రెవెన్యూ అధికారులతో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ దురుసుగా ప్రవర్తించారని గతంలో వార్తలొచ్చాయి. చెరువు ఆక్రమణదారులకు టీఆర్ఎస్ నేతల మద్దతు ఉందని బీజేపీ ఆరోపించింది. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసువాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. కాగా కబ్జాలను అడ్డుకున్నందుకే ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ శ్రేణులు విమర్శించాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.