యాప్నగరం

ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు సీరియస్ ఆదేశాలు

Telangana High Court: కూలీల తరలింపు కోసం ఉద్దేశించిన శ్రామిక్‌ రైళ్లు పెంచడం లేదా వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో 4 బోగీల చొప్పున అదనంగా జోడించడం వంటివి చేయాలని హైకోర్టు సూచించింది.

Samayam Telugu 2 Jun 2020, 5:35 pm
వలస కార్మికుల తరలింపు, వారికి కల్పించే వసతుల విషయంలో తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి మరోసారి సీరియస్ సూచనలు చేసింది. స్వస్థలాలకు వెళ్లే వలస కార్మికులు రైళ్లు లేదా బస్సులు ఎక్కేవరకు వారికి భోజనం, ఉండేందుకు తగిన వసతి కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. ఇటుక బట్టీల కార్మికులు ఇంకా వలస కూలీలను వారి సొంత ప్రాంతాలకు తరలించాలని కొద్ది రోజుల క్రితం హైకోర్టులో ఓ వ్యాజ్యం దాఖలు కాగా.. మంగళవారం అది విచారణకు వచ్చింది. ఈ క్రమంలో ధర్మాసనం ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Telangana high court


కార్మిక శాఖ ఉప కమిషనర్లు రాష్ట్రంలోని ఇటుక బట్టీలు సందర్శించి వలస కూలీలను గుర్తించాలని హైకోర్టు సూచన చేసింది. స్వస్థలాలకు వెళ్లాలనుకునే వలస కూలీలను షెల్టర్‌ జోన్లకు తరలించాలని కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. సౌత్ సెంట్రల్ రైల్వేను సమన్వయం చేసుకొని వారి సహకారంతో వలస కార్మికులను సొంత ప్రదేశాలకు పంపే అంశాన్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకోవద్దని, దీన్ని సీరియస్‌గా పరిగణించాలని పేర్కొంది.

కూలీల తరలింపు కోసం ఉద్దేశించిన శ్రామిక్‌ రైళ్లు పెంచడం లేదా వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో 4 బోగీల చొప్పున అదనంగా జోడించడం వంటివి చేయాలని సూచించింది. శ్రామిక్‌ రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో ప్రభుత్వం తరలించే వలస కూలీల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విపత్కర పరిస్థితుల్లో వలస కూలీల సమస్యపై ప్రభుత్వం సమగ్ర పాలసీ రూపొందించాలని హైకోర్టు సూచించింది.

Must Read: undefined

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.