యాప్నగరం

ఫ్లైఓవర్ ప్రమాదం: కృష్ణమిలాన్ రావు అరెస్ట్‌పై జనవరి 3వరకు స్టే

Hyderabad Flyover ప్రమాదంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితుడు కల్వకుంట్ల కృష్ణమిలాన్ రావును జనవరి 3 వరకు అరెస్టు చేయొద్దని పోలీసులకు స్పష్టం చేసింది.

Samayam Telugu 13 Dec 2019, 12:08 pm
యో డైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదంలో కారు ఓనర్, వీడియో గేమ్స్ సంస్థ సీఈవో కల్వకుంట్ల కృష్ణమిలాన్ రావు అరెస్టుపై హైకోర్టు స్టే విధించింది. జనవరి 3 వరకు ఆయణ్ని అదుపులోకి తీసుకోవద్దని తెలంగాణ పోలీసులకు స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై హైకోర్టులో గురువారం (డిసెంబర్ 12) విచారణ జరిగింది. యాక్సిడెంట్ చేసిన వ్యక్తిపై సెక్షన్ 304 (2) కింద ఎలా కేసు పెడతారని ఈ సందర్భంగా పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది.
Samayam Telugu car2


కృష్ణమిలాన్ రావు తరఫు న్యాయవాది ఇప్పటికే రోడ్డు ప్రమాదంపై కోర్టులో వాదనలు వినిపించారు. ప్రమాద సమయంలో ఆయన 40 kmph వేగంతోనే కారు నడుపుతున్నారని.. ప్రమాదానికి ఫ్లైఓవర్ డిజైనే కారణమని వాదించారు. వంతెనపై ‘ఎస్’ ఆకారంలో రెండు ప్రమాదకర మలుపులు ఉన్నాయని.. ఈ మలుపు కారణంగానే ఘటన జరిగిందని వివరించారు. ఫ్లైఓవర్‌పై ఇంతకుముందు కూడా ఇద్దరు మృతి చెందారని.. దానికి కారణం డిజైన్‌‌లో లోపమేనని వాదించారు.

Also Read: వీడియో గేమ్స్ సంస్థ సీఈవో.. అదే తీరున డ్రైవింగ్, ఇప్పుడు తిరకాసు

మరోవైపు.. ప్రమాద సమయంలో కృష్ణమిలన్ రావు నడుపుతున్న వోక్స్‌వ్యాగన్ పోలో కారు 104 kmph వేగంతో ఉందని పోలీసులు వివరాలు సమర్పించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ప్రమాద సమయంలో కారును నడిపిన కృష్ణమిలాన్ రావు అరెస్ట్‌పై జనవరి 3వరకు స్టే విధించింది. అప్పటి వరకు ఆయణ్ని అరెస్ట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 3కు వాయిదా వేసింది.

నగరంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై నవంబర్ 23న ఈ ఘోర దుర్ఘటన జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు వంతెన రెయిలింగ్‌ను తాకి, అమాంతం ఎగిరి కింద పడింది. ఆ సమయంలో రోడ్డుపై నిల్చొని ఆటో కోసం వేచి చూస్తున్న సత్యవాణి అనే మహిళపై ఆ కారు పడటంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ప్రమాదంలో మరో ఆరుగురు గాయపడ్డారు. కారు నడుపుతున్న కృష్ణమిలాన్ రావు సీటు బెల్టు పెట్టుకోవడంతో గాయాలతో బయటపడ్డారు.

Also Read: హాజీపూర్ కిల్లర్‌కు ఉరి శిక్ష ఖాయమా.. విచారణ చివరి దశకు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.