యాప్నగరం

అగ్గి రాజేసిన ఎంపీ వ్యాఖ్యలు.. టీఆర్ఎస్-బీజేపీ నేతల బాహాబాహీ

Hanamkonda: ఆదివారం జరిగిన వరంగల్ పార్టీ శ్రేణుల సమావేశానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వచ్చారు. ఈ సమావేశంలో ఆయన స్థానిక ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్‌ లక్ష్యంగా విమర్శలు చేశారు.

Samayam Telugu 12 Jul 2020, 6:05 pm
హన్మకొండలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వరంగల్ బీజేపీ అర్బన్ ఆఫీసుపై టీఆర్ఎస్ నేతలు దాడికి యత్నించారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణుల వైఖరికి నిరసనగా బీజేపీ నేతలు రాస్తారోకో నిర్వహించారు. ఈ క్రమంలో బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారి మధ్య తోపులాట చోటుచేసుకుంది. తోపులాటలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ సొమ్మసిల్లి పడిపోయారు.
Samayam Telugu టీఆర్ఎస్-బీజేపీ కార్యకర్తల ఉద్రిక్తత
High tensions between trs and bjp workers in hanamkonda


ఆదివారం జరిగిన వరంగల్ పార్టీ శ్రేణుల సమావేశానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వచ్చారు. ఈ సమావేశంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ లక్ష్యంగా ధర్మపురి అర్వింద్ విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలే టీఆర్ఎస్ నేతల ఆగ్రహానికి గురిచేశాయి. వినయ్ బాస్కర్, నరేందర్‌ను అర్వింద్ బిల్లా రంగాలతో పోల్చారు. వీరు భూకబ్జాలకు పాల్పడుతున్నాయని, ఒక్కొక్కరిపై చాలా కేసులు ఉంటాయని అన్నారు.

Also Read: అరాచకత్వానికి అదే నిదర్శనం.. కేసీఆర్‌పై విజయశాంతి సెటైర్లు

దీనిపై స్పందించిన టీఆర్ఎస్ నేతలు దమ్ముంటే అర్వింద్ ఆ ఆరోపణలను రుజువు చేయాలని సవాలు విసిరారు. పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నేతలు హన్మకొండ హంటర్ రోడ్డులోని బీజేపీ కార్యాలయంపై దాడికి దిగారు. ఎంపీ అర్వింద్ దమ్ముంటే రుజువు చేయాలని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి అదుపుతప్పకుండా నిలువరించారు.

టీఆర్ఎస్ నేతలు బీజేపీ కార్యాలయంపై దూసుకురావడాన్ని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. ఇక్కడ కూడా పోలీసులు కలగజేసుకొని వీరిని చెదరగొట్టారు. ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణలు మరింతగా కొనసాగే అవకాశం ఉండడంతో పోలీసులు వినయ్ భాస్కర్, నరేందర్ ఇంటివద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.