యాప్నగరం

అన్నపూర్ణగా అవతరించిన తెలంగాణ.. దేశంలోనే టాప్

వరిధాన్యం సేకరణలో దేశం నిర్దేశించుకున్న లక్ష్యంలో ఒక్క తెలంగాణ నుంచే సగానికి పైగా సేకరించినట్లు ఎఫ్‌సీఐ తెలిపింది.

Samayam Telugu 27 May 2020, 9:34 pm
తెలంగాణ రాష్ట్రం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రజల ఆకలి తీర్చే అన్నపూర్ణగా అవతరించింది. దేశానికే ధాన్యాగారంగా నిలిచింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థాయితో వరి దిగుబడులు సాధించి దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించింది. వరి ధాన్యం దిగుబడి, సేకరణలో అగ్రస్థానం సాధించింది. యాసంగి పంట వరి ధాన్యం సేకరణలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని ఎఫ్‌సీఐ తెలిపింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


ఈ ఏడాది భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 91.07 లక్షల టన్నుల్లో సగానికి పైగా తెలంగాణ నుంచే సేకరించిటన్లు పేర్కొంది. ఇప్పటి వరకూ దేశంలో 83.01 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించగా అందులో రాష్ట్ర వాటానే అధికమని.. ఒక్క తెలంగాణ నుంచే 52.23 లక్షల టన్నులు సేకరించినట్లు వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.