యాప్నగరం

మీకో దండం అయ్యా.. మండే రోడ్డుపై హోంగార్డు సాష్ఠాంగ నమస్కారం

Lockdown Violators: ఓ హోంగార్డు బయట వాహనాలపై తిరుగుతున్న వారికి నమస్కారం పెట్టారు. నేలపై పడుకొని సాష్ఠాంగ నమస్కారం పెట్టి మరీ, పరిస్థితులను అర్థం చేసుకోవాలని, బయట తిరగొద్దని చెప్పడం విశేషం.

Samayam Telugu 26 Apr 2020, 10:41 pm
లాక్ డౌన్‌లో నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరిగే వారికి అదుపు చేయడం ఎవరి తరమూ కావడం లేదు. పోలీసులు వాహనాలను సీజ్ చేస్తున్నా, కేసులు పెడుతున్నా, దండిస్తు్న్నా చాలా మంది వినడం లేదు. రోడ్లపైకి వచ్చేవారు పోలీసుల మాటలను పెడచెవిన పెట్టి తిరుగుతున్నారు. దీంతో సహనం కోల్పోయిన ఓ హోంగార్డు బయట వాహనాలపై తిరుగుతున్న వారికి ఏం చెప్పాలో తెలియక నమస్కారం పెట్టారు. నేలపై పడుకొని సాష్ఠాంగ నమస్కారం పెట్టి మరీ, పరిస్థితులను అర్థం చేసుకోవాలని, బయట తిరగొద్దని చెప్పడం విశేషం.
Samayam Telugu 52040a38-730d-4d3d-b3f4-856bd5d0452c


Also Read: undefined

వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో విధులు నిర్వర్తించే హోంగార్డు కృష్ణాసాగర్‌ అనవసరంగా ద్విచక్రవాహనాలపై బయటకు వచ్చిన యువతను నిలిపి పోలీసులకు సహకరించాలని కోరారు. లాక్‌డౌన్‌ నిబంధనలు అందరి మంచి కోసమేనని గుర్తించాలని.. ‘మీకు దండం పెడతా బయటకు రాకండయ్యా బాబూ’ అంటూ సాష్టాంగ నమస్కారం చేశారు. దీంతో యువకులు ఇకముందు అనవసరంగా బయటకు రామంటూ పోలీసులకు హామీ ఇచ్చారు.

Also Read: సీఎం పని చేతకాకపోతే చెప్రాసీ పని చేస్కోండి.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.