యాప్నగరం

తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి షాక్!

Coronavirus Hyderabad: తెలంగాణ నుంచి దిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన మర్కాజ్ ప్రార్థనలకు చాలా మంది హాజరైన నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం ఉన్నతాధికారులతో చేసిన సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది.

Samayam Telugu 1 Apr 2020, 11:11 pm
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కరోనా వైరస్, లాక్ డౌన్ తదితర అంశాలపై జరిగిన జరిగిన సమావేశానికి హోం మంత్రి మహమూద్ అలీకి అనుమతి నిరాకరించారు. సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు ప్రధాన ద్వారం వద్ద లోపలికి అనుమతి లేదని ప్రగతి భవన్ సిబ్బంది చెప్పడంతో ఆయన తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. అయితే, డీజీపీ మహేందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరితో పాటు మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్‌ కుమార్‌, వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు హాజరయ్యారు.
Samayam Telugu mahmood ali


Watch: ముళ్ల కర్రతో అక్కడ కొడితే మాంసం ఎగురుతది.. పోలీసుల హెచ్చరిక.. వీడియో వైరల్

తెలంగాణ నుంచి దిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన మర్కాజ్ ప్రార్థనలకు చాలా మంది హాజరైన నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం ఉన్నతాధికారులతో చేసిన సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. వీరివల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్రంలో మరింత కఠిన నిబంధనలు అమలు చేసే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. సమావేశం ముగిశాక ముఖ్యమంత్రి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి సీఎం.. గవర్నర్‌కు వివరిస్తారని తెలుస్తోంది.

Also Read: వరంగల్‌లో ‘కరోనా నాగు పాము’.. కుబుసం విడిచి, గంటల కొద్దీ..

Must Read: కేసీఆర్ సమీక్షకు డిప్యూటీ సీఎంకు నో ఎంట్రీ.. కారణాలేంటంటే..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.