యాప్నగరం

ఆటోలోనే రోగికి అత్యవసర వైద్యం.. నాగర్‌కర్నూల్‌లో దుస్థితి

Nagarkurnool: ఓ వ్యక్తికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. సమయానికి వైద్యుడు కూడా అందుబాటులో లేరని బాధితులు వాపోయారు.

Samayam Telugu 19 Jul 2020, 10:33 am
ప్రభుత్వ ఆస్పత్రిలో సౌకర్యాల లేమికి అద్దం పట్టే మరో ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. జిల్లాలోని కల్వకుర్తి నియోజక వర్గ పరిధిలోని ఉన్న ఆమనగల్లు సర్కారీ దవాఖానాలో పడకలు ఖాళీ లేవు. ప్రస్తుతం కరోనా కేసుల వల్ల పడకలన్నీ నిండిపోయాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. సమయానికి వైద్యుడు కూడా అందుబాటులో లేరని బాధితులు వాపోయారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో అక్కడున్న నర్సు ఆ బాధితుడిని ఆటోలో ఉంచి చికిత్స అందించింది.
Samayam Telugu ఆటోలోనే చికిత్స అందిస్తున్న దృశ్యం
Nagarkurnool amangal


రోగికి గ్లూకోజ్ పెట్టింది. కానీ, ఆ బాటిల్‌ను పైన తగిలించేందుకు ఏ సహకారమూ లేదు. ఇక చేసేది లేక అతని కుమార్తె ఆ గ్లూకోజ్ సీసాను పైకి లేపి పట్టుకుంది. పడకలు ఖాళీగా లేవు కాబట్టి అతణ్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని నర్సు సూచించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఏమీ తోచని ఆ పేద కుటుంబం కాసేపు అక్కడే ఉండిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి మరో ఆస్పత్రికి వెళ్లారు.

Also Read: undefined

Must Read: కరోనాతో జనం దూరం.. భర్త శవం తోపుడు బండిపై కాటికి.. భార్య అవస్థలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.