యాప్నగరం

టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చేయండి.. వాళ్లను టార్గెట్ చేసిన ఈటల

తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, కేసీఆర్ గద్దె దిగే సమయం ఆసన్నమైందిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు.

Samayam Telugu 5 Dec 2021, 8:53 am

ప్రధానాంశాలు:

  • కేసీఆర్ గద్దె దిగే సమయం ఆసన్నమైంది
  • ఉద్యమకారులు టీఆర్ఎస్‌ను వీడాలి
  • హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల సంచలన వ్యాఖ్యలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ఈటల రాజేందర్
మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గె్ట్ చేశారు. కేసీఆర్ మాయమాటలు నమ్మి మోసపోకుండా ఉద్యమకారులంతా టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేయాలని పిలుపునిచ్చారు. శనివారం రాత్రి ఇల్లెందులో కార్యకర్తల సమావేశంలో పాల్గొనటానికి వెళ్తూ ఈటల మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్‌లో కేసీఆర్ అడుగులకు మడుగులొత్తే వాళ్లకే పదవులు వస్తాయని విమర్శించారు. ఏడేళ్ల నుంచి కేసీఆర్ మాటలకు, చేతలకు అసలు పొంతనే ఉండటం లేదని, ప్రతిసారీ మాయమాటలు, మోసపు మాటలు చెబుతూ గట్టెక్కుతాడని మండిపడ్డారు.
ప్రత్యేక తెలంగాణ సాధించకున్నా స్వరాష్ట్రంలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ఎవరికీ ప్రాధాన్యత దక్కడం లేదని ఈటల రాజేందర్ ఆరోపించారు. తెలంగాణ ప్రజలు అన్నీ చూస్తున్నారని, సమయం వచ్చినప్పుడు కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కేసీఆర్ బుద్ధి ఎలాంటిదో హుజురాబాద్ ఉపఎన్నికల్లో బయటపడిందని, అందుకే అక్కడి ప్రజలు మరిచిపోలేని షాకిచ్చారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, కేసీఆర్ గద్దె దిగే సమయం ఆసన్నమైందని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలంతా పాటుపడాలని పిలుపునిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.