యాప్నగరం

మహిళా పోలీసులతో కరోనాపై పాట.. రఘు మాస్టర్ కొరియోగ్రఫీ

Hyderabad City Police: పలువురు మహిళా కానిస్టేబుళ్లను మొమెంటోలతో సీపీ సత్కరించారు. ఈ సందర్భంగా అంజనీ కుమార్‌ మాట్లాడుతూ.. జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌, రాత్రి సమయంలో కర్ఫ్యూలను విజయవంతం చేశామని చెప్పారు.

Samayam Telugu 12 May 2020, 7:14 pm
కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా హైదరాబాద్‌ పరిధిలోని మహిళా పోలీసులు ఓ పాటకు నృత్యం చేశారు. చౌరస్తా బ్యాండ్ గ్రూప్ కరోనా వైరస్‌పై రూపొందించిన ఓ పాట విపరీతంగా ప్రజాదరణ పొందిన సంగతి తెలిసిందే. ఆ పాటకు మహిళా పోలీసులు నృత్యం చేస్తూ అవగాహన కల్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి సంబంధించిన వీడియోను బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో మంగళవారం సీపీ అంజనీ కుమార్‌ విడుదల చేశారు.

పలువురు మహిళా కానిస్టేబుళ్లను మొమెంటోలతో సీపీ సత్కరించారు. ఈ సందర్భంగా అంజనీ కుమార్‌ మాట్లాడుతూ.. జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌, రాత్రి సమయంలో కర్ఫ్యూలను విజయవంతం చేశామని చెప్పారు. లాక్‌ డౌన్‌ సమయంలో కూడా మహిళా పోలీసులు నిరంతరం డ్యూటీ చేస్తున్నారని కొనియాడారు. ఐసోలేషన్‌, క్వారంటైన్లలో మహిళా కానిస్టేబుళ్ల పాత్ర ఎంతో అవసరమని చెప్పారు. కొన్ని పోలీసు స్టేషన్లలో కేవలం ఒక్కరు మాత్రమే ఉంటే.. మిగతా వారందరూ లాక్‌ డౌన్‌ విధుల్లో ఉంటున్నారని సీపీ తెలిపారు.

Also Read: undefined

కాగా, చౌరస్తా బ్యాండ్ రూపొందించిన ఈ పాటకు రఘు మాస్టర్ కొరియోగ్రాఫీ అందించారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో మహిళా పోలీసులు నృత్యం చేయడం ఆకట్టుకుంది. కరోనా నుంచి రక్షణ పొందేందుకు అంతా కొన్ని రోజులు ఓపిక పట్టాలని, ఈ సమయంలో పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని, వారి కృషిని గుర్తించాలనే సందేశం ఆ పాటలో ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.