యాప్నగరం

నడిరోడ్డుపై వాన నీటిలో పడుకున్న కార్పొరేటర్.. అధికారులపై మండిపాటు

వర్షపు నీటిలో పడుకొని కార్పొరేటర్ వినూత్న నిరసన తెలిపిన ఘటన హైదరాబాద్‌లో చర్చనీయాంశంగా మారింది. కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఇలా నిరసన తెలిపారు.

Samayam Telugu 26 Sep 2019, 12:02 am
భాగ్యనగరంలో మంగళవారం (సెప్టెంబర్ 24) రాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఆయన వర్షపు నీటిలో పడుకొని నిరసన వ్యక్తం చేసిన ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Samayam Telugu Corporator


భాగ్యనగరంలో కురిసిన కుండపోత వర్షానికి హయత్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని సుష్మా సాయినగర్‌ ‘గ్రీన్‌ మిడోన్‌ కాలనీ’లోకి వెళ్లే దారిలో భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఈ విషయాన్ని వారు స్థానిక కార్పొరేటర్‌ తిరుమల్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అక్కడికి చేరుకొని అధికారుల తీరుపై మండిపడ్డారు.

Must Read: విద్యార్థినుల ఫోటోలు తీసి పోర్న్ సైట్లలో.. హైదరాబాద్‌ యువతి దారుణం

స్థానిక సమస్యలపై ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని కార్పొరేటర్ తిరుమల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వర్షపు నీటిలో పడుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. కాార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి గతంలో రోడ్లపై చెత్త క్లీన్ చేస్తూ, నాలాల్లో చెత్త తొలగిస్తూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ భాగ్యనగరంలో ఏకధాటిగా కురిసిన వర్షం బీభత్సం చేసిన సంగతి తెలిసిందే. ఈ వర్షంతో లోతట్టు ప్రాంతాలు, పలు అపార్టుమెంట్లలో నిలిచిన నీరు అలాగే ఉండిపోగా.. బుధవారం సాయంత్రం కురిసిన వర్షంతో పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. ఈసారి మరింత కుండపోతగా వర్షం కురిసింది. దీంతో నగర జీవనం స్తంభించింది.

Also Read: బొప్పాయి చిచ్చు.. డెంగ్యూతో ధరలకు రెక్కలు, రైతులపై దళారుల దాష్టీకం

వరద నీరు భారీగా చేరడంతో హుస్సేన్ సాగర్‌ జలమట్టం అంతకంతకూ పెరుగుతోంది. లోతట్టు ప్రాంతాల వారిని ఇది భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఉద్యోగులు, విద్యార్థులు ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో వర్షం కురవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు మార్గం ద్వారా వెళ్లే దారి లేక.. మెట్రో రైళ్లను ఆశ్రయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.