యాప్నగరం

హింసాత్మక వీడియోలపై సీపీ రియాక్షన్.. వాట్సాప్ అడ్మిన్‌లకు హెచ్చరిక..

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లకు హెచ్చరికలు జారీ చేశారు. హింసాత్మక ఘటనలకు సంబధించిన వీడియోలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Samayam Telugu 20 Aug 2019, 12:07 pm
వాట్సాప్, ఫేస్‌బుక్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న హింసాత్మక వీడియోలపై హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ స్పందించారు. మంగళవారం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు హెచ్చరికలు జారీ చేశారు. వివిధ గ్రూపులో హింసకు సంబంధించిన వీడియోలను, ఫేక్ వీడియోలను పోస్ట్ చేస్తే, అడ్మిన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అంజనీ కుమార్ హెచ్చరించారు. వాట్సాప్ వీడియోలు, మెసేజ్‌లపై పోలీసులు నిఘా పెట్టారని వివరించారు.
Samayam Telugu CP


ఇతర దేశాల్లో జరిగిన హింసాకాండకు చెందిన వీడియోలను కొందరు వాట్సాప్ గ్రూపులో పెడుతున్నారని సీపీ తెలిపారు. దీంతో నగరంలో శాంతిభద్రతల పరిస్థితికి భంగం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఎన్నో అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలకు హబ్ అయిన హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు. రెచ్చగొట్టే వీడియోలు పోస్టు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.