యాప్నగరం

దిల్లీ అల్లర్లు: ప్రజలకు హైదరాబాద్ సీపీ కీలక సూచనలు

Hyderabad: నగరంలో నిరంతరం బైక్‌లపైనా, కార్లలోనూ పోలీస్ పెట్రోలింగ్ జరుగుతూనే ఉంటుందని, ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే తమ దృష్టికి తేవాలని చెప్పారు. అల్లర్లపై ఇక్కడ జరిగే రూమర్లను నమ్మవద్దని సూచించారు.

Samayam Telugu 26 Feb 2020, 12:41 pm
సీఏఏకు వ్యతిరేకంగా దిల్లీలో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ నగర ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. దిల్లీలో జరుగుతున్న అల్లర్ల కారణంగా నగరంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అక్కడ జరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా హైదరాబాద్‌లోనూ అలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశముందని హెచ్చరించారు. నగరంలో నిరంతరం బైక్‌లపైనా, కార్లలోనూ పోలీస్ పెట్రోలింగ్ జరుగుతూనే ఉంటుందని, ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే తమ దృష్టికి తేవాలని చెప్పారు. అల్లర్లపై ఇక్కడ జరిగే రూమర్లను నమ్మవద్దని సూచించారు. హైదరాబాద్ గొప్పతనాన్ని కాపాడడంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని పౌరులకు పిలుపునిచ్చారు.
Samayam Telugu Hyd CP Anjani Kumar



Also Read: రెండు లారీలు ఢీ.. మధ్యలో ఇరుక్కున్న వ్యక్తి, చివరికి..

మరోవైపు దిల్లీ అల్లర్ల చిత్రాలను ప్రసారం చేయడంలో జాతీయ మీడియా ఛానెళ్లు సంయమనం పాటించాలని సీపీ మరో ట్వీట్ చేశారు. శాంతియుత ప్రాంతాల్లో సాధారణ జీవితం గడుపుతున్న వారిపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇతర ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా అందరూ సహకరించాలని కోరారు.


Also Read: పరిగెడుతూ విజయవాడ నుంచి హైదరాబాద్‌కు.. మూడు రోజుల్లోనే పూర్తి!

మరోవైపు, హైదరాబాద్‌ నగరంపై తన ప్రేమ చాటుకొనేలా సీపీ మరో ట్వీట్ చేశారు. ఇక్కడి పాత బస్తీ తనకు మరింత ఇష్టమని, ఎందుకంటే అది నగర ఘన చరిత్రకు ప్రతీక అని కొనయాడారు. మంగళవారం రాత్రి తాను కూడా పెట్రోలింగ్‌లో పాల్గొన్నానని చెప్పారు. రాత్రి 11 గంటల సమయంలో మదీన, గుల్జర్ హౌజ్, ఇతెబార్ చౌక్, మీర్ చౌక్, పురానీ హవేలీ, దరుషిఫా, సాలర్జంగ్ రోటరీ, కాలీ కబ్రే, చాదర్ ఘాట్, నింబోలీ అడ్డా, గోల్నాక, అంబర్‌పేట తదితర ప్రాంతాల మీదుగా పెట్రోలింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు.

Must Read: మెట్రో పాసులుంటాయా? ఉండవా? తేల్చిచెప్పిన హెచ్ఎంఆర్ ఎండీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.