యాప్నగరం

ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద ఉత్సవ సమితి నిరసన

ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్ద నిరసనలు, ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. గణనాథుడి దర్శనాల విషయంలో పలువురు ఆందోళనలకు దిగుతున్నారు.

Samayam Telugu 24 Aug 2020, 2:26 pm
ఖైరతాబాద్ వినాయకుడి వద్ద నిరసనకు దిగింది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి. ప్రభుత్వం కరోన సాకుతో గణేష్ ఉత్సవాలకు అడ్డంకులు సృష్టిస్తుందని సమితి సభ్యులు ఆరోపించారు. దేశం మొత్తం గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని గణేశ్ ఉత్సవాలను ఆటంకాలు కల్గిస్తుందని విమర్శలు చేశారు. గ్రామాల్లో సైతం టీఆర్ఎస్ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నల్ల జెండలతో ఆందోళనకు దిగారు ఉత్సవ సమితి సభ్యులు. హిందూ వ్యతిరేక చర్యలకు తగిన బుద్ధి చెపుతామన్నారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు బాగవంత్ రావు.
Samayam Telugu ఖైరతాబాద్ గణేష్
khbd ganesh


ఆదివారం కూడా ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద భజరంగదళ్ కార్యకర్తలు నిరసనకు దిగారు. కరోన కారణంగా సాధారణ భక్తులకు అనుమతి లేదన్నారు. రోడ్డుమీద నుంచి మాత్రమే దర్శనం కల్పిస్తామని ప్రకటించారు. అయితే ఇందులో భాగంగానే బయటి నుంచే తాళ్లు కట్టి వెలుపలే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. దీంతో కమిటీ సభ్యుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భజరంగ్ దళ్ సభ్యులు ఆందోళనకు దిగారు. గణపతి విగ్రహానికి అడ్డంగా పరదా కట్టొద్దని నిరసన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళన కారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Read More: సెల్‌ఫోన్ ఇవ్వలేదని.. 15 ఏళ్ల కూతురు ఎంత పనిచేసిందంటే
భాగ్యనగరానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఖైరతాబాద్‌లో ఈసారి 9 అడుగుల గణనాథుడు కొలువుతీరాడు. కరోనా వైరస్ కారణంగా ఈసారి ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా గణేష్ నవరాత్రులు నిర్వహిస్తున్నారు. అయితే చరిత్రలో మొట్టమొదటి సారిగా గణపతి పండగపై కరోనా ఆంక్షలు విధించాల్సి వచ్చింది. ఈసారి 9 అడుగుల విగ్రహం మాత్రమే ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జనం కూడా అక్కడే చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.