యాప్నగరం

హైదరాబాద్‌వాసులకు గుడ్ న్యూస్.. నగరాన్ని దాటేసిన వాయుగుండం

30 ఏళ్ల తర్వాత హైదరాబాద్ మీదుగా వాయుగుండం ప్రయాణించింది. దీంతో నగరాన్ని ఎన్నడులేనంతగా భారీ వర్షం ముంచెత్తింది. దీంతో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. నగరం మొత్తం నీట మునిగింది.

Samayam Telugu 15 Oct 2020, 9:12 am
హైదరాబాద్‌ను వాయుగుండం దాటింది. దాదాపు 30 ఏండ్ల తరువాత హైదరాబాద్‌ మీదుగా ప్రయాణించిన వాయుగుండం కర్ణాటకకు చేరడంతో పెద్ద గండం తప్పింది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం నగరాన్ని ముంచెత్తింది. ఇక మంగళవారం కురిసిన కుంభవృష్టికి మహానగరం జలమయం అయిన విషయం తెలిసింది. భారీ వర్షాలకు ఇప్పటికే నగరంలో 24 మంది మరణించారు. పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వరదలో చిక్కుకున్న పలువురిని బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Samayam Telugu హైదరాబాద్‌ను దాటేసిన వాయుగుండం
hyderabad rain update


అయితే ఈ ఏడాది వానల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం జూన్‌లోనే అంచనా వేసింది. సాధారణం కంటే 130 శాతం అధికంగా కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు గతంలోనే తెలిపారు. అయితే వాయుగుండం రాష్ట్రాన్ని దాటడంతో గ్రేటర్‌లో ఇక భారీ వర్షాలు కురిసే అవకాశం లేదన్నారు. అయితే దీని ప్రభావంతో రాగల మరో నాలుగు రోజులు తేలికపాటి వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ వివరించింది.

Read More: అంత్యక్రియలకు ముందు మూలిగిన యువతి.. వెెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా

మరోవైపు వాయుగుండం ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం వర్షాలకు హైదరాబాద్‌ నగరం తడిసి ముద్దయింది. భారీ వర్షానికి పోటెత్తిన వరద ఉధృతి ఇంకా తగ్గలేదు. బుధవారం రాత్రి నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.