యాప్నగరం

కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం... ఎగిసిపడుతున్న మంటలు

ప్రమాదం జరిగిన షాపు పక్కనే సీఎంఆర్, బంగారం షోరూలు ఉండటంతో మంటల్ని అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. తెల్లవారుజామున ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గుర్తించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.

Samayam Telugu 15 Nov 2020, 8:23 am
కేపీహెచ్‌బీ కాలనీలోని హార్డ్‌వేర్‌ దుకాణంలో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా షాపులో సామగ్రికి మంటలు అంటుకొని దావానంలా వ్యాపించాయి. రాందేవ్ ఎలక్ట్రికల్ అనే హార్డ్ వేర్ షాపులో అగ్నిప్రమాదం జరగటంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. మంటలు చెలరేగిన షాప్ కిందనే Cmr జువెల్లరి షాప్ ఉండటం తో భారీగా ఆస్తి నష్టం జరుగుంతుందని అంచనా వేశారు.
Samayam Telugu షాపులో ఎగిసిపడుతున్న మంటలు
kukatpally fire accident


Read More: గ్రేటర్ ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్.. టీటీడీపీ నేతలతో సమావేశం

పక్కనే ఉన్న బట్టల షోరూమ్ లు,ఇంకో పక్కన గల జోయలుక్కాస్ బంగారం షోరూమ్ లు ఉండటం తో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఫైర్ సిబ్బంది. స్థానికులు గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి వెంటనే సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదంలో లక్షల్లో ఆస్తినష్టం జరిగి ఉంటుందని సమాచారం. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాక నష్టంపై స్పష్టత వచ్చే అవకాశముంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.